డబ్ల్యూహెచ్ఓ ఓ కీలక ప్రకటన... మరో మహమ్మారి

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అధిపతి టెడ్రోస్ అధనామ్ ఓ కీలక ప్రకటన చేశారు. కోవిడ్-19 కంటే ప్రాణాంతకమైన మరో మహమ్మారి పొంచి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. కోవిడ్-19 ముగిసిందంటే ప్రపంచానికి ఆరోగ్య ముప్పు తొలగినట్టు కాదని టెడ్రోస్ తెలిపారు. 76వ ప్రపంచ ఆరోగ్య సభలో డబ్ల్యూహెచ్ చీఫ్ ఈ విషయాన్ని వెల్లడిరచారు. వాస్తవానికి ఆ మహమ్మారి వ్యాప్తి చెందుతూ తొలుత ప్రాణాంతకంగా మారిన తదనంతరం తన ఉనికిని వివిధ వేరియంట్లగా మార్చుకుంటూ మనం ఎదుర్కునే తీవ్రత గత ముప్పుగా పరిణిమించడం నెమ్మదించిందన్నారు. అయినప్పటికీ ఇది మనకు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా సాధ్యమైనంత త్వరగా ప్రతిస్పందించేలా ప్రభావవంతమైన యంత్రాగాల అవసరాన్ని గురించి నొక్కి చెప్పిందన్నారు.
Tags :