దీపావళి వేడుకల్లో వైట్‌హౌజ్‌

దీపావళి వేడుకల్లో  వైట్‌హౌజ్‌

బైడెన్‌ ఆతిధ్యంపై భారతీయుల సంతోషం

అమెరికా అధ్యక్షుడి నివాస భవనమైన శ్వేత సౌధం చరిత్రలోనే భారీస్థాయిలో నిలిచిపోయేలా అధ్యక్షుడు జోబైడెన్‌ దీపావళి వేడుకలను వైభవంగా నిర్వహించారు. దీపావళి పండుగ వేళ వైట్‌హౌజ్‌ దీపాల వెలుగులతో మెరిసిపోయింది. బైడెన్‌ దంపతులు ఈ సందర్భంగా నిర్వహించిన ‘దీపావళి రిసెప్షన్‌’కి 200 మందికి పైగా గెస్టులు హాజరయ్యారు. ఈ సంబరాలలో పూర్తి భారతీయత కనిపించడం విశేషం. సాంస్కృతిక ప్రదర్శనలు కనువిందు చేశాయి. సితారిస్ట్‌ రిషబ్‌ శర్మ, ఎస్‌ఏ డ్యాన్స్‌ కంపెనీ ట్రూపు ఆధ్వర్యాన సాగిన ఆర్టిస్టుల డ్యాన్సులు, వారి పర్ఫామెన్స్‌ కట్టి పడేశాయి. గెస్టుల వస్త్ర ధారణ చూస్తే ఇండియాలోనే ఉన్నట్టు అనిపించేలా కనిపించిందని చెబుతున్నారు.దీపావళి సందర్భంగా జోబైడెన్‌ దంపతుల విశిష్ట ఆదరణను మరిచిపోలేమని యూఎస్‌-ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌ అతుల్‌ కేశప్‌ వ్యాఖ్యానించారు. ఈ ఆతిథ్యాన్ని అందుకోవడం ఓ గొప్ప ప్రివిలేజ్‌ అని టీవీ ఏసియా సీఈఓ హెచ్‌.ఆర్‌. షా పేర్కొన్నారు. అలాగే ఆసియన్‌ అమెరికన్స్‌ పై గల అడ్వైజరీ కమిషన్‌ సభ్యుడు అజయ్‌ జైన్‌ భుటారియా .. దక్షిణాసియా వాసులను బైడెన్‌ ప్రభుత్వం ఎంతగా గౌరవిస్తుందో ఈ ఈవెంట్‌ నిరూపిస్తోందన్నారు. బైడెన్‌ ప్రభుత్వం 130 మందికి పైగా ఇండియన్‌ అమెరికన్లను ఉన్నత స్థానాల్లో నియమించిందని ఆయన చెప్పారు. అంతకు ముందు బైడెన్‌ దంపతులుఅతిథులను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు జోబైడెన్‌ మాట్లాడుతూ మీకు ఆతిథ్యమివ్వడాన్ని గౌరవంగా భావిస్తాను.

శ్వేత సౌధంలో ఈ స్థాయిలో నిర్వహిస్తున్న తొలి దీపావళి ఇదే. మా వద్ద గతంలో కంటే ఇప్పుడు పెద్దసంఖ్యలో ఆసియా-అమెరికన్లు ఉన్నారు. దీపావళిని అమెరికా సంస్కృతిలో సంతోషకరమైన వేడుకలుగా మార్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమెరికా చరిత్రలోనే తొలి ఆఫ్రికా, దక్షిణాసియా మహిళ కమలా హ్యారిస్‌ నేతృత్వంలోని నా కార్యనిర్వాహక వర్గం సమక్షంలో దీపాలను వెలిగించడం గౌరవంగా భావిస్తున్నాను అని పేర్కొన్నారు.  అమెరికా వృద్ధిలో ఇండో అమెరికన్ల కృషి చాలా ఉందని బైడెన్‌ చెప్పారు. కరోనా సమయంలో సైతం ఇక్కడి ప్రవాస భారతీయులు దేశ సేవకే అంకితమయ్యారని ఆయన ప్రశంసించారు. వీరి కృషిని తాము సదా గుర్తుంచుకుంటామన్నారు. దేశం ఆర్థికంగా ఎదిగేందుకు తాము ప్రవాస భారతీయుల సేవలను ఎప్పుడూ ఉపయోగించుకుంటామన్నారు. దీపావళి వేడుకల సందర్భంగా హిందువులు, జైనులు, సిక్కులు, బౌద్ధులకు బైడెన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ దీపావళి వేడుకలకు ముగ్గురు ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. ఈ ముగ్గురు యువ భారతీయ-అమెరికన్లను అధ్యక్షుడు జో బైడెన్‌ స్వయంగా ఆహ్వానించారు. దీనిద్వారా డిఫర్డ్‌ యాక్షన్‌ లీగల్‌ చైల్డ్‌హుడ్‌ అరైవల్స్‌ (డీఏఎల్‌సీఏ) పిల్లలకు సంఫీుభావం తెలుపుతున్న సందేశాన్ని ఆయన అందించారని భావిస్తున్నారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులతో కలసి అమెరికా వెళ్లి, అక్కడ నివసించడానికి తగిన పత్రాలు లేని పిల్లలు డీఏసీఎల్‌ఏలో ఉన్నారు. వీరిని ఎప్పుడైనా అమెరికా నుంచి బహిష్కరించే అవకాశం ఉంటుంది. డీఏఎల్‌సీఏ పిల్లల తరఫున పోరాడుతున్న ‘ఇంప్రూవ్‌ ద డ్రీమ్‌’ సంస్థ వ్యవస్థాపకుడు దీప్‌ పటేల్‌తోపాటు పరీన్‌ మహత్రే, అతుల్య రాజ్‌కుమార్‌ ఈ వేడుకలకు హాజరయ్యారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షురాలు కమలా హారిసతో కలసి దీపావళి వేడుకల్లో పాల్గొనడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు.

 

praneet obili-garuda AHA poulomi Png-jewelry aurobindo MUPPA
Tags :