వాట్సప్ బిజినెస్‌లో కొత్త ఫీచర్
మెటాకు చెందిన వాట్సప్ బిజినెస్‌లో పలు కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. వినియోగదారులు నమ్మకమైన సంస్థలను గుర్తించేందుకు వెరిఫైడ్ బ్యాడ్జ్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. మరింత మెరుగైన మెసేజింగ్ సేవల కోసం కృత్రిమ మేధ టూల్స్‌ను చేర్చినట్లు ముంబయిలో జరిగిన వాట్సప్ బిజినెస్ సదస్సులో మెటా తెలిపింది. వినియోగదారులతో మెరుగ్గా అనుసంధానమయ్యేందుకు వాట్సప్ బిజినెస్ యాప్‌పై కృత్రిమ మేధను యాక్టివేట్ చేస్తున్నామని వెల్లడించింది. ప్రస్తుతం భారత్‌లో ఇది పరీక్షల దశలో ఉందని, ప్రారంభ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నట్లు వివరించింది. భారత్‌లో చిన్న వ్యాపారాల వృద్ధికి తోడ్పాటు ఇస్తామని, వాట్సప్ బిజినెస్ యాప్‌పై కస్టమైజ్డ్ మెసేజ్‌లను తీసుకువచ్చినట్లు పేర్కొంది.
Tags :