చంద్రముఖి2 అసలు ట్విస్ట్ ఏంటంటే?

2003లో రిలీజైన చంద్రముఖి సినిమా హర్రర్ బ్లాక్ బస్టర్‌గా ఓ ఊపు ఊపింది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఆ సినిమాకు సీక్వెల్‌గా చంద్రముఖి2 వస్తుందంటే అందరికీ చాలానే అనుమానాలున్నాయి. దానికి తోడు చంద్రముఖి2 ట్రైలర్ కూడా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోవడంతో వారి అనుమానాలు నిజమయ్యాయి. డైరెక్టర్ వాసు ఒరిజినల్ వెర్షన్‌నే రీమేక్ చేశారనే కామెంట్స్ కూడా వినిపించాయి.
ఈ విషయమై నెట్టింట ట్రోల్స్ కూడా వచ్చాయి. అయితే రీసెంట్‌గా హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్ లో ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక ట్విస్ట్ ను చెప్పేశారు. చంద్రముఖి సినిమాలో ఆత్మ జ్యోతికను ఆవహిస్తుంది తప్పించి ఆమె దెయ్యం కాదు. కానీ ఇప్పుడు ఈ సీక్వెల్ లో ఒరిజినల్ చంద్రముఖిగా కంగనా రనౌత్ కనిపించనుందట.
మొదటి భాగంలో కేవలం ఆత్మనే ఈ రేంజ్‌లో భయపెట్టిందంటే, ఇక ఈ సినిమాలో నిజమైన దెయ్యంతో ఎలాంటి సీన్స్ ఉంటాయో, సినిమా ఎంత భయంకరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాకు ఇప్పటి వరకు పెద్దగా బజ్ లేకపోయినా రిలీజ్ వరకు చంద్రముఖి2ని గట్టిగా ప్రమోట్ చేద్దామని టీమ్ రంగంలోకి దిగింది. సినిమా బాగా వచ్చిందని ఇప్పటికే ప్రివ్యూలు చూసినవాళ్లు అంటున్నారు. మరి చంద్రముఖి2 ప్రేక్షకుల్ని ఎంతలా భయపెడుతుందో చూడాలి.






