సామాజిక సేవ చేసిన ‘వాటా’

సామాజిక సేవ చేసిన ‘వాటా’

తెలంగాణ సంస్కృతిని సియాటెల్‌లో వ్యాప్తి చేయడమే లక్ష్యంగా వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ (వాటా) కృషి చేస్తోంది. తెలంగాణలో అతిపెద్ద పండుగ అయిన ‘బతుకమ్మ’ ఇచ్చే సందేశం ప్రకృతిని ప్రేమించడం, రక్షించడం అని తెలిసిందే. ఇదే సందేశాన్ని అందరికీ పంచాలని అనుకున్న వాటా.. బోథెల్ ప్రాంతంలోని ఒక రోడ్డును ఎంచుకొని, ఆ రోడ్డుపై పడేసిన చెత్తను శుభ్రం చేసింది. ఈ సందర్భంగా తమతో కలిసి సేవ చేసిన వాలంటీర్లకు వాటా ధన్యవాదాలు తెలిపింది. వీరి వల్లనే తమ లక్ష్యం నెరవేరిందని కొనియాడింది. తమ స్థానిక కమ్యూనిటీకి సేవ చేసినందుకు గర్వంగా ఉందని, తమ కృషికి నగరంలో కూడా గుర్తింపు లభించిందని వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ సంతోషం వ్యక్తం చేసింది.

 

 

Tags :