Radha Spaces ASBL

బైడెన్ తీసుకుంటున్న చర్యల వల్ల ఇది సాధ్యమైంది : జూలీ

బైడెన్ తీసుకుంటున్న చర్యల వల్ల ఇది సాధ్యమైంది  :  జూలీ

అమెరికా పర్యటనకు వెళ్లే భారతీయుల వీసా ఇంటర్వ్యూ నిరీక్షణ కాలం ఈ ఏడాది 60 శాతం తగ్గినట్టు అమెరికా విదేశాంగ శాఖ ఉన్నతాధికారి జూలీ స్టఫ్ట్‌ తెలిపారు. బైడెన్‌ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యల వల్ల ఇది సాధ్యమైందని  పేర్కొన్నారు. గత అక్టోబరులో బీ1 (బిజినెస్‌) / బీ2 ( పర్యాటక) వీసా ఇంటర్వ్యూల నిరీక్షణ కాలం సుమారు వెయ్యి రోజులుంది. మొదటిసారి వీసా కోసం చేసిన దరఖాస్తులకు మోక్షం లభించడానికి, ముఖ్యంగా బీ1, బీ2 వీసాలకు సుదీర్ఘమైన నిరీక్షణ కాలం ఉండటంపై భారత్‌లో కొంతకాలంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో నిరీక్షణ కాలం తగ్గించేందు పలు చర్యలు చేపట్టినట్టు అమెరికా తెలిపింది.  భారత్‌లో అధికారుల సంఖ్యను పెంచాం. గతంలో ఎప్పుడూ లేనట్టుగా బ్యాంకాక్‌ లాంటి చోట సైతం భారతీయులకు వీసా ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నాం. హైదరాబాద్‌లో కొత్త కాన్సులేట్‌ భవనాన్ని ప్రారంభించాం అని జూలీ స్టఫ్ట్‌ పేర్కొన్నారు. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :