MKOne Telugu Times Business Excellence Awards

తెలంగాణకు మరో అంతర్జాతీయ సంస్థ

తెలంగాణకు మరో అంతర్జాతీయ సంస్థ

తెలంగాణకు మరో అంతర్జాతీయ సంస్థ రానుంది. సాంకేతిక రంగంలో వినియోగదారులకు వినూత్న సేవలందించడంలో దిగ్గజ సంస్థగా చెప్పుకొనే బైన్‌ క్యాపిటల్‌కు చెందిన వీఎక్స్‌ఐ గ్లోబల్‌ సొల్యూషన్స్‌ హైదరాబాద్‌లో అడుగుపెట్టనుంది. అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో హ్యూస్టన్‌ నగరంలో వీఎక్స్‌ఐ గ్లోబల్‌ సొల్యూషన్స్‌ గ్లోబల్‌ చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ ఆఫీసర్‌ ( సీహెచ్‌ఆర్‌ఓ) ఎరికా బోగర్‌ కింగ్‌ సమావేవమయ్యారు. తమ సంస్థ సేవల కేంద్రాన్ని హైదరాబాద్‌లో  ఏర్పాటు చేస్తామని మంత్రితో భేటీ అనంతరం ఆమె ప్రకటించారు.  హైదరాబాద్‌లో అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా బిజినెస్‌ ఎకోసిస్టమ్‌ వృద్ధి చెందిన కారణంగానే తమ సేవల కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నామని వీఎక్స్‌ఐ గ్లోబల్‌ సొల్యూషన్స్‌ తెలిపింది. మొదటి మూడేళ్లలో అయిదు వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని మొత్తంగా 10 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని సంస్థ పేర్కొంది. గత ఏడాది దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమలో 4.50 లక్షల ఉద్యోగాలు ఏర్పడితే అందులో 1.5 లక్షలు హైదరాబాద్‌లోనే లభించాయని పేర్కొన్నారు. 

 

 

Tags :