ASBL Koncept Ambience
facebook whatsapp X

విజయ్ ది గోట్ మూవీ ఆన్లైన్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే..

విజయ్ ది గోట్ మూవీ ఆన్లైన్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే..

ఒక స్టార్ హీరో సత్తా ఎప్పుడు బయటపడుతుందంటే.. ఆ హీరో నటించిన సినిమా టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టినప్పుడు. సాధారణంగా ఇలాంటివి ఫిలిం ఇండస్ట్రీలో చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం ఉన్న టైంలో భారీ అంచనాల మధ్య సూపర్ టాక్ తో విడుదలై 100 కోట్ల గ్రాస్ ని అందుకోవడమే కష్టం.. అయితే మిక్స్డ్, డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న మూవీతో ఓ హీరో 400 కోట్లకు పైగా వసూలు రాబట్టాడు. ఇప్పుడు ఆ మూవీ కాస్త ఓటీటీ లో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. 

ఇంతకీ ఆ మూవీ ఏమిటో తెలుసా? దళపతి విజయ్ (Thalapathy Vijay) హీరోగా, వెంకట ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ ది గోట్ ‘ (The GOAT). సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ ఫిల్మ్‌గా సెప్టెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కోలీవుడ్లో బంపర్ సక్సెస్ సాధించింది. అయితే మిగిలిన భాషల్లో మాత్రం ఈ చిత్రానికి చాలావరకు డిజాస్టర్ టాక్ వచ్చింది. అయినా సరే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం సుమారు 452 కోట్లు వసూలు రాబట్టి సరికొత్త రికార్డును స్థాపించింది. ఒక్క తమిళనాడు నుంచే ఈ చిత్రం 218 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. 

ఈ మూవీకి సంబంధించిన స్ట్రీమింగ్ రైట్స్ ను ఆన్లైన్ ది గజ సంస్థ నెట్ ఫిక్స్ (Netflix) భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. ఇక దసరా పండుగల సందర్భంగా అక్టోబర్ 3న ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని నెట్ఫిక్స్ తన ఎక్స్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 3 నుంచి విజయ్ గోట్ చిత్రం తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లో ఈ చిత్రాన్ని చూడడం మిస్ అయిన వారు సెలవలో ఈ మూవీని బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఈ మూవీలో విజయ్ ని పాతికేళ్ల కుర్రాడిగా  చూపించడానికి సరికొత్త 'డీ-ఏజింగ్‌’ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ మూవీలో విజయ్ ద్విపాత్రాభినయం చేశారు. విజయ్ తో పాటు మీనాక్షి చౌదరి, త్రిష, స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా ఈ చిత్రంలో కీలకపాత్రను పోషించారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :