రివ్యూ : నేటి యంగ్ జనరేషన్ కి ప్రేరణ కలిగించే 'విజయానంద్' సక్సెస్ స్టోరీ  

రివ్యూ : నేటి యంగ్ జనరేషన్ కి ప్రేరణ కలిగించే 'విజయానంద్' సక్సెస్ స్టోరీ  

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థ : వి ఆర్ ఎల్ ఫీల్మ్ ప్రొడక్షన్స్
నటీనటులు: నిహాల్, అనంత్ నాగ్, రవిచంద్రన్, భరత్ బోపన్న, అనీష్ కురువిల్ల, ప్రకాష్ బేలావాడి,సిరి ప్రహ్లాద్ తదితరులు..
సంగీత దర్శకులు: గోపీ సుందర్, సినిమాటోగ్రఫీ: కీర్తన్ పూజారి
ఎడిటర్: హేమంత్ కుమార్, నిర్మాత: VRL ఫిల్మ్ ప్రొడక్షన్స్, ఆనంద్ సంకేశ్వర్
దర్శకుడు : రిషిక శర్మ

విజయానంద్.. కన్నడ నాట VRL ట్రావెల్స్ వ్యవస్థాపకుడు విజయ్ సంకేశ్వర్ బయోపిక్. కేవలం ఒకే ఒక ట్రక్కుతో ఒక పెద్ద లాజిస్టిక్ కంపెనీ సామ్రాజ్యానికి అధిపతి అయ్యారు. ఎంతో మందికి ప్రేరణ ఇచ్చిన ఆయన జీవిత చరిత్రపై తెరకెక్కిన బయోపిక్‌లో నిహాల్ హీరోగా నటించారు. VRL ఫిలిం ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మించిన ఈ చిత్రానికి  రిషికా శర్మ దర్శకత్వం వహించారు.  మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ:

ఈ సినిమా కథ విషయానికొస్తే.. విజయ్ సంకేశ్వర్ (నిహాల్) వాళ్ల తండ్రి కర్ణాటకలోని గడగ్‌లో ఒక మాములు ప్రింటింగ్ ప్రెస్ యజామాని.ఈ ప్రెస్‌లో చదువుకునే పుస్తకాలతో పాటు పెళ్లి పత్రికలు సహా ఎన్నింటినో ప్రింట్ చేస్తుంటారు. తన తండ్రి ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేయడం ఇష్టముండని విజయ్ సంకేశ్వర్.. సొంతంగా ఓ లారీ కొనుక్కొని వ్యాపారం చేయాలనుకుంటారు. ఈయన సొంత  ప్రింటింగ్ ప్రెస్ ఒదిలి లాజిస్టిక్ బిజినెస్‌ చేయడం తండ్రికి ఇష్టముండదు. అయినా సరే  తాను నమ్ముకున్న దారిలోనే వెళతాడు. ఈ క్రమంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొంటారు.  ఒక్క ట్రక్కుతో మొదలైన ఆయన ప్రస్థానం దాదాపు 5 వేలకు ట్రక్కుల యాజమాని అవుతాడు. 45 ఏళ్లలోనే కర్ణాటకలో అగ్ర వ్యాపారవేత్తగా ఎదుగుతాడు. ఈ క్రమంలో ఈయన ఒక దిన పత్రికను కూడా స్థాపించాల్సి వస్తోంది. అందకు దారి తీసిన పరిస్థితులు ఏమిటి ? చివరకు తాను నమ్ముకున్న దారిలో ఎలా విజయాన్ని సొంతం చేసుకున్నాడనేడే విజయానంద్ జీవిత కథ.

నటీనటుల హావభావాలు:

ఒక సాధారణ ట్రక్కు డ్రైవర్‌గా జీవితాన్ని ప్రారంభించి ఒక పెద్ద లాజిస్టిక్ మరియు పత్రిక రంగాన్నే శాసించే స్థాయి ఎదిగిన విజయ్ సంకేశ్వర్ పాత్రలో నిహాల్ చక్కగా నటించారు. సీరియల్ నటుడిగా, యాంకర్‌గా చేసిన ఈయనకు ఈ సినిమాలో ఎంతో అనుభవం ఉన్న నటుడిగా తన పాత్రకు న్యాయం చేసారు. ఇక ఈయన అబ్బాయి ఆనంద్ సంకేశ్వేర్ పాత్రలో నటించిన భరత్ బోపన్న.. తన క్యూట్ లుక్స్‌తో పాటు నటనతో అట్రాక్ట్ చేసాడు. ఇక విజయ్ సంకేశ్వర్ తండ్రి పాత్రలో నటించిన అనంత్ నాగ్ తన పాత్రలో జీవించాడనే చెప్పాలి. ఇక విజయ్ సంకేశ్వర్‌ వ్యాపారంలో రాణించడానికీ సహాయపడే గణేష్ పాత్రలో రవిచంద్రన్ నటన బాగుంది. ఇక ఈ సినిమాలో రామారావు అనే పత్రక యాజమాని పాత్రలో నటించిన ప్రకాష్ బేలావాడి యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఈ సినిమాలో తన నటనతో డామినేట్ చేసాడు. ఈయన భార్య లలిత పాత్రలో నటించిన సిరి ప్రహ్లాద్ నటన బాగుంది. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించారు.

సాంకేతికవర్గం పనితీరు:

సాంకేతిక విభాగం విషయానికి వస్తే .. ఒక మాములు మధ్య తరగతి స్థాయి నుంచి ఉన్నత స్థితికి ఎలా చేరకున్నాడనే ఆయన జీవితాన్ని ఒక సినిమాగా అది కూడా ఆకట్టుకునే విధంగా  తెరకెక్కించడంలో దర్శకురాలు రిషికా శర్మ ఎంతగా హోం వర్క్ చేసిందో ఈ సినిమా చూస్తే తెలుస్తోంది. ఒక వ్యక్తి జీవితంలో జరిగిన సంఘనలను దాదాపు 2 గంటల పాటు ప్రేక్షకులను కదలకుండా కూర్చోబెట్టడంలో ఓ దర్శకురాలిగా సక్సెస్ అయింది.  స్క్రిప్ట్ లో ల్యాగ్ లేకుండా చూసుకుని ఉండి ఉంటే ఇంకా బాగుండేది. పాటలు బాగున్నాయి. ఇక సినిమాటోగ్రఫీ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సినిమాలోని చాలా సన్నివేశాలను కెమెరామెన్ ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. అయితే ఎడిటర్ సినిమాలోని సాగతీత సన్నివేశాలను తగ్గించి ఉంటే.. సినిమాకి బాగా ప్లస్ అయ్యేది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

విశ్లేషణ:

ఒక వ్యక్తి జీవితాన్ని సినిమాగా తెరకెక్కించాలంటే అందులో కావాల్సింత ఎమోషన్,ఇన్‌స్ప్రేషన్, మోటివేషన్ ఉండాలి. అవన్ని ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ సంకేశ్వర్ జీవితంలో ఉన్నాయి. ఈయను అందరు కన్నడ అంబానీగా పిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఒకే ఒక ట్రక్కుతో ప్రారంభమై దాదాపు 5 వేలకు ట్రక్కులకు ఎలా  యాజమానిగా మారాడేనేది ఇపుడున్న నేటి యువతకు ఎంతో ప్రేరణగా నిలుస్తోంది. ఆయన జీవితాన్ని ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించడంలో సఫలమైంది రిషికా శర్మ. బయోపిక్ కాబట్టి.. సినిమా మొత్తం సీరియస్‌గా సహజధోరణిలో సాగిపోతూనే ఉంటుంది.  అన్ని వర్గాల  ప్రేక్షకులకు ఈ సినిమా ఆకట్టుకోలేకపోవచ్చు.

 

Tags :