కృతితో రొమాన్స్ చేయలేనంటున్న హీరో

క్యారెక్టర్స్ విషయంలో ఆర్టిస్ట్ లకు రూల్స్ అంటూ ఏం ఉండవు. ఓ సినిమాలో హీరోకు హీరోయిన్ గా చేసిన హీరోయినే మరో సినిమాలో చెల్లిగా కనిపించి మెప్పిస్తుంటుంది. అయితే ఉప్పెన సినిమాలో తనకు కూతురిగా నటించిన అమ్మాయిని తర్వాత తన సినిమాకు హీరోయిన్‌గా పెడితే నో అన్నాడట కోలీవుడ్ యాక్టర్ విజయ్ సేతుపతి.
ఉప్పెన సినిమాలో కృతి శెట్టి, విజయ్ సేతుపతికి కూతురిగా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కృతిని సేతుపతి చేస్తున్న తమిళ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ చేసి, విజయ్ సేతుపతికి చెప్పడంతో వెంటనే సేతుపతి నో అన్నాడట. తన కూతురిగా చేసిన అమ్మాయితో తాను రొమాన్స్ చేయలేనని తేల్చి చెప్పేశాడట.
సినిమాలో చేసిన క్యారెక్టర్ ను ఇంత సీరియస్ గా ఎందుకు తీసుకున్నారని సేతుపతిని అడిగితే ఆయనో రీజన్ చెప్పాడు. ఉప్పెన సినిమా షూటింగ్ టైమ్ లో క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు కృతి ఇబ్బంది పడుతుంటే, మీ నాన్న అనుకుని నటించు అని సర్దిచెప్పానని, ఆ తర్వాత కృతి టెన్షన్ లేకుండా నటించగలిగిందని, కృతిని నిజంగా తన కూతురిలానే ఫీలయ్యానని అందుకే హీరోయిన్ గా వద్దని చెప్పినట్లు ఆయన వివరించారు.






