చైల్డ్ ఆర్టిస్ట్‌గా విజయ్ దేవరకొండ చిన్ననాటి వీడియో

చైల్డ్ ఆర్టిస్ట్‌గా విజయ్ దేవరకొండ చిన్ననాటి వీడియో

విజయ్ దేవరకొండ చదువు అంతా కూడా పుట్టపర్తిలోని ఆశ్రమంలో జరిగిందన్న సంగతి తెలిసిందే. విజయ్, ఆనంద్ ఇద్దరూ కూడా అక్కడే చదివారు. విజయ్ దేవరకొండ చిన్నతనంలో ఓ సీరియల్‌లో చిన్న పాత్రను పోషించాడన్న సంగతి తెలిసిందే. పుట్టపర్తి ఆశ్రమంలో చదువుకుంటున్న సమయంలో ఆ సీరియల్ తెరకెక్కించారని, ఆ వీడియో వెనుకున్నకథను వివరించాడు. విజయ్ దేవరకొండ హీరోగా మంచి పీక్స్‌కు చేరుకున్నాక.. తన చిన్ననాటి వీడియో ఒకటి వైరల్ కాసాగింది.అయితే ఆ సమయంలోనే విజయ్ దేవరకొండ నటించేశాడు. అక్కడ తీసిన ఓ సీరియల్‌లో విజయ్ దేవరకొండ నటించాడు. ఆ వీడియో అప్పట్లో తెగ చక్కర్లు కొట్టింది.

విజయ్ చిన్ననాటి వీడియో, చైల్డ్ ఆర్టిస్ట్‌గా కూడా నటించాడు తెలుసా? అంటూ రకరకాలుగా ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొట్టేసింది. అయితే ఇప్పుడు దాని వెనుకున్న అసలు స్టోరీని విజయ్ దేవరకొండ చెప్పాడు. ఆహా కోసం బాలయ్య చేస్తోన్న అన్ స్టాపబుల్ షోలో లైగర్ టీం సందడి చేసిన సంగతి తెలిసిందే. ఆ షోలో బాలయ్య ఈ వీడియోను ప్లే చేయించి మరీ క్లారిటీ ఇప్పించాడు. ఆ వీడియోను చూసి పూరి, ఛార్మీ షాక్ అయ్యారు. ఇది ఏంటి? మేం ఎప్పుడూ చూడలేదు అని అన్నారు. దీంతో విజయ్ అసలు కథను చెప్పాడు. పుట్టపర్తి ఆశ్రమంలో.. స్వామి గురించి షిర్టీ సాయి దివ్య కథ అని ఓ సీరియల్ తీశారు. లావుగా, బొద్దుగా ఉన్న వాళ్లను తీసుకెళ్లారు.. డైలాగ్ చెప్పగలుగుతాడు అనే వాళ్లకు అలా ఇచ్చారు.. అందులో ఉన్నది నేనే కానీ.. ఆ వాయిస్ నాది కాదు.. డబ్బింగ్ చెప్పలేదు అని విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చాడు.

Tags :