ASBL NSL Infratech
facebook whatsapp X

'వీరాంజనేయులు విహారయాత్ర' ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ లా వుంటుంది : డా. నరేశ్ వికె &టీం

'వీరాంజనేయులు విహారయాత్ర' ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ లా వుంటుంది : డా. నరేశ్ వికె &టీం

నవరసరాయ డా. నరేశ్ వికె, రాగ్‌ మయూర్‌, ప్రియా వడ్లమాని లీడ్ రోల్స్ నటిస్తున్న హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘వీరాంజనేయులు విహారయాత్ర’. అనురాగ్‌ పలుట్ల దర్శకత్వం వహించారు. బాపినీడు.బి, సుధీర్‌ ఈదర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటివలే విడుదలైన టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆగస్ట్ 14న ఈ సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీం కాబోతోంది. ఈ రోజు ప్రెస్ ప్రిమియర్ స్క్రీన్ చేశారు మేకర్స్. అనంతరం మూవీ యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

ప్రెస్ మీట్ లో డా. నరేష్ వికె మాట్లాడుతూ..ఉషాకిరణ్ మూవీస్ కి శ్రీవారికి ప్రేమ లేఖ ఎంత పెద్ద సినిమానో ఈటీవీ విన్ కి 'వీరాంజనేయులు విహారయాత్ర’ అంత పెద్ద సినిమా అవుతుందని మొన్న ప్రెస్ మీట్ లో అన్నాను. అంత పెద్ద సినిమా కాబట్టి ఈ మాట నమ్మకంగా చెప్పగలిగాను. రిలీజైన తర్వాత ఈటీవీ విన్ కి ఇది హయ్యస్ట్ గ్రాసర్ అవుతుంది. ఇందులో ప్రేక్షకులు ఊహించని కామెడీ, డైలాగ్స్ పంచస్ వుంటాయి. దీంతో పాటు ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ లా వుంటుంది. సామజవరగమనా తర్వాత మంచి ఫ్యామిలీ ఫిల్మ్ కోసం చుస్తున్నారు ఆడియన్స్. వీరాంజనేయులు విహారయాత్ర ఆ ఆకలి తీర్చినట్లుగా వుంటుంది.  డైరక్టర్ అనురాగ్ ఈ సినిమాతో తన స్టాంప్ వేసుకుంటాడు, అద్భుతమైన విజువల్స్ వుంటాయి. నిర్మాతలు చాలా అద్భుతంగా నిర్మించారు. అందరికీ థాంక్స్. టీజర్ వచ్చినప్పటినుంచి ఈ సినిమా వైరల్ అయ్యింది. మనసులో మిగిలిపోయే నిమా చేసినందుకు చాలా ఆనందంగా వుంది. నటుడిగా గొప్ప అనుభూతిని ఇచ్చిన సినిమా ఇది' అన్నారు.

యాక్టర్ రాగ్ మయూర్ మాట్లాడుతూ.. ఈ సినిమా చూసినప్పుడు మీ అందరికీ మీ జ్ఞాపకాలు, ఫ్యామిలీ బాండింగ్స్ గుర్తొచ్చాయనే అనుకుంటున్నాను. చాలా ఎమోషన్స్ తో కూడుకున్న సినిమా ఇది. ఆ ఎమోషన్ ని మీరు ఫీలైయ్యారని భావిస్తున్నాను. నరేష్ గారు నా ఫేవరేట్. ఆయనతో నాకు మంచి సీన్స్ వున్నాయి. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. మా డైరెక్టర్ చాలా మంచి ఎమోషనల్ రోల్ ఇచ్చారు. ఈ సినిమాలో నటించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఆగస్ట్ 14న సినిమా స్ట్రీమ్ అవుతోంది. తప్పకుండా చూడండి. ఈ ఉషా కిరణాలు పాట ఎంత బావుటుందో ఈ సినిమా అంత బావుంటుంది' అన్నారు.
 
హీరోయిన్ ప్రియా వడ్లమాని మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మీకు మా మూవీ నచ్చిందని కోరుకుంటున్నాను. మంచి ఫ్యామిలీ ఎమోషన్ వున్న సినిమా ఇది. నరేష్ గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆగస్ట్ 14న సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరూ మీ ఫ్యామీలీస్ తో చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు' అన్నారు.

దర్శకుడు అనురాగ్ పాలుట్ల మాట్లాడుతూ.. మీడియాకి థాంక్ యూ. ఈ సినిమా మీరే ఫస్ట్ ఆడియన్స్. ప్రేమతో చేసిన సినిమా ఇది. ఇంతమంచి నటులు, టెక్నికల్ టీం దొరకడం నా అదృష్టం. ఐదు రాష్ట్రాలలో షూట్ చేశాం. 36 రోజుల్లో షూట్ ఫినిష్ చేశాం. ఇంత మంచి టీం వలనే ఇది పాజిబుల్ అయ్యింది. ఇదొక రిలేటబుల్ మూవీ. హై ఎమోషన్స్ వుంటాయి. మా చూసిన ఆడియన్స్ తప్పకుండా కనెక్ట్ అవుతారు' అన్నారు. వెంట్ లో చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు.  

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :