తమ్ముడు తప్పుకుంటే అన్నయ్య వస్తాడా?
ఇంకా అఫీషియల్ గా అనౌన్స్‌మెంట్ రాలేదు కానీ గేమ్ ఛేంజర్(game Changer) సినిమా సంక్రాంతికి, విశ్వంభర(Viswambhara) సమ్మర్ కు పోస్ట్ పోన్ అయ్యాయని డిస్ట్రిబ్యూటర్లు మాట్లాడుకుంటున్నారు. దిల్ రాజు(dil raju) తన సర్కిల్ లోని బయ్యర్లకు తన బ్యానర్ నుంచి రామ్ చరణ్(ram Charan), వెంకటేష్(venkatesh) సినిమాలు సంక్రాంతికి వస్తాయని, ఆ మేరకు ఏర్పాట్లు చేసుకోమని చూచాయగా చెప్పాడని తెలుస్తోంది.
కుదిరితే దసరా సందర్భంగా లేదంటే మరో ఒకటి రెండు వారాల్లో అఫీషియల్ గా అనౌన్స్‌మెంట్స్ ఇస్తామని దిల్ రాజు వారికి చెప్పినట్లు సమాచారం. దీంతో గేమ్ ఛేంజర్ కు మంచి రిలీజ్ సీజన్ దొరికిందని మెగా ఫ్యాన్స్ సంతోషపడినా, విశ్వంభరకు మాత్రం రిలీజ్ డేట్ విషయంలో ఎంతో ఛాలెంజ్ ఉండనుంది.
భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ విజువల్ వండర్ కు సోలో రిలీజ్ డేట్ అయితేనే శ్రేయస్కరం. అలా చూసుకుంటే మార్చి లాస్ట్ వీక్ అందుబాటులో ఉంది. కానీ ఆల్రెడీ ఆ డేట్ ను హరిహర వీరమల్లు(Harihara Veeramallu) అఫీషియల్ గా కొన్ని వారాల ముందే లాక్ చేసుకుంది. దానికంటే ముందుగా వీడీ12(VD12) కూడా అదే డేట్ ను ఫిక్స్ చేసుకుంది. అయితే పవన్(Pawan Kalyan) వస్తే విజయ్(Vijay Devarakonda) సినిమా వాయిదా పడటం ఖాయం.
మరి విశ్వంభర పరిస్థితేంటనుకోవచ్చు. దీని వెనుక ఓ మాస్టర్ ప్రీ ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏదైనా కారణాల వల్ల వీరమల్లు మళ్లీ వాయిదా పడితే వెంటనే ఆ డేట్ ను వాడుకోవాలని విశ్వంభర టీమ్ చూస్తుందట. అంటే తమ్ముడు సినిమా ప్లేస్ లో అన్నయ్య సినిమా వస్తుందన్నమాట. కానీ ఈసారి వీరమల్లు ఆ ఛాన్స్ ఇవ్వకపోవచ్చు. ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలు పడుతున్న ఈ సినిమా వల్ల నిర్మాత ఏఎం రత్నం(A. M Ratnam) చాలా బరువు మోస్తున్నాడు. కాబట్టి మార్చి కాకపోతే విశ్వంభరకు ఏప్రిల్ లేదా జూన్ లోనే మళ్లీ రిలీజ్ డేట్ దొరుకుతుంది. ఏదేమైనా ఈ విషయంలో అధికారిక ప్రకటన వచ్చేవరకు ఏం జరుగుతుందో చెప్పలేం.