ASBL Koncept Ambience
facebook whatsapp X

వరుణ్ తేజ్ 'మట్కా' నవంబర్ 14న థియేట్రికల్ రిలీజ్

వరుణ్ తేజ్ 'మట్కా' నవంబర్ 14న థియేట్రికల్ రిలీజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) హైలీ యాంటిసిపేటెడ్ పీరియడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మట్కా' (Matka) షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం, టీమ్ వరుణ్ తేజ్, ఫైటర్స్‌తో కూడిన చాలా కీలకమైన, ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తోంది. కరుణ కుమార్ దర్శకత్వంలో వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న 'మట్కా' వరుణ్ తేజ్‌కి మోస్ట్ హై బడ్జెట్ మూవీ.

ప్రొడక్షన్ చివరి దశలో వుండటంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా జరగడంతో 'మట్కా' మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఈ చిత్రం కార్తీక పూర్ణిమకు ముందుగా నవంబర్ 14న థియేటర్లలోకి రానుంది, సినిమాకి లాంగ్ వీకెండ్‌ అడ్వాంటేజ్ వుంటుంది.
 
ఫస్ట్ లుక్ పోస్టర్ తో అదరగొట్టిన మేకర్స్ సెకండ్ లుక్ రిలీజ్ చేశారు. వరుణ్ తేజ్ పోస్టర్‌లో రెట్రో అవతార్‌, సూట్‌లో సిగరెట్ కాలుస్తూ మెట్లపై నడుస్తున్న పోస్టర్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

కరుణ కుమార్ పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను రాసారు. 1958, 1982 వరకు 24 సంవత్సరాల పాటు సాగే పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌ని ఎంచుకున్నారు. వరుణ్ తేజ్‌ని నాలుగు డిఫరెంట్ అవతార్స్ లో అద్భుతంగా చూపిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్, వర్కింగ్ స్టిల్స్ లో వరుణ్ తేజ్ వైవిధ్యమైన లుక్స్ అదరగొట్టాయి.  

వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, ఎ కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రానికి కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్.

 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :