ASBL NSL Infratech
facebook whatsapp X

మెగా హీరో సినిమాకి సూప‌ర్‌స్టార్ సాంగ్ టైటిల్

మెగా హీరో సినిమాకి సూప‌ర్‌స్టార్ సాంగ్ టైటిల్

సూప‌ర్ హిట్ సాంగ్స్ ను సినిమాల టైటిల్స్ గా పెట్ట‌డం ఎప్ప‌ట్నుంచో జ‌రుగుతున్న ట్రెండే. రావోయి చంద‌మామ, చెప్ప‌వే చిరుగాలి, ఆడువారి మాట‌ల‌కు అర్థాలే వేరులే, పిల్లా నువ్వే లేని జీవితం ఇలా ఎన్నో టైటిల్స్ ఈ లైన్ లో ఉన్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మ‌రో టైటిల్ చేర‌బోతున్న‌ట్లు స‌మాచారం. మెగా హీరో వైష్ణ‌వ్ తేజ్ త‌న కొత్త సినిమాను సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు సినిమాలోని సాంగ్ ను టైటిల్ గా పెట్టుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

భ‌ర‌త్ అనే నేను సినిమాలో వ‌చ్చాడ‌య్యో సామీ సాంగ్ ఎంత పాపుల‌రైందో అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సాంగ్ ను వైష్ణవ్ త‌న కొత్త సినిమాకు టైటిల్ గా వాడుకోనున్నాడ‌ట‌. లిరిసిస్ట్ ట‌ర్డ్న డైరెక్ట‌ర్ కృష్ణ చైత‌న్య ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. టైటిల్ చూస్తుంటే సినిమాలో ఎలివేష‌న్లు గ‌ట్టిగానే ఉండేట్లున్నాయి.

ఉప్పెన సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన వైష్ణ‌వ్ కు ఆ త‌ర్వాత చేసిన ఏ సినిమా కూడా హిట్ కాలేదు. త‌ను చేసిన ప్ర‌తీ సినిమా నిరాశ ప‌రుస్తూనే వ‌చ్చింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని ఇప్పుడు కృష్ణ చైత‌న్య‌తో ఈ సినిమాను ప‌ట్టాలెక్కించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు వైష్ణ‌వ్ తేజ్. ద‌స‌రా నిర్మాత సుధాక‌ర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించ‌నున్న‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ సినిమా గురించి అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానుంది.  

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :