ఓటమి భయంతోనే కేసీఆర్.. తప్పుడు ప్రచారం : ఉత్తమ్

కాంగ్రెస్ పార్టీపై ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుబంధు ఆపేయాలని తామెక్కడా చెప్పలేదని అన్నారు. బీఆర్‌ఎస్ సర్కార్ పథకాలను మించి కాంగ్రెస్ అమలు చేస్తుందని తెలిపారు. ఓటమి భయంతోనే రైతుబంధు, 24 గంటల కరెంటు విషయంలో కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ మాత్రమే గాలి వీచిందని ఇకపై సునామి రాబోతుందంటున్నారు.







Tags :