ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఉక్రెయిన్‌పై దాడిచేస్తే.. తీవ్ర పరిణామాలు: జో బైడెన్

ఉక్రెయిన్‌పై దాడిచేస్తే..  తీవ్ర పరిణామాలు: జో బైడెన్

ఉక్రెయిన్‌పై రష్యా దాడిచేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను అమెరికా అధ్యక్షుడు తీవ్ర స్వరంతో హెచ్చరించారు. పుతిన్‌పై వ్యక్తిగత ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. ఉక్రెయిన్‌ సరిహద్దుకు సమీపంలో రష్యా తన సేవలను మోహరించడంతో ఉద్రికత్తలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో ఉక్రెయిన్‌ విషయంలో ఏదో జరగబోతోందని ఊహించిన అమెరికా రక్షణ శాఖ పెంటగాన్‌ ఏ క్షణాన అయిన 8,500 దళాలను పంపేందుకు సిద్ధంగా

ఉన్నామని ప్రకటించింది. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. బైడెన్‌ మీడియాతో మాట్లాడుతూ ఉక్రెయిన్‌ రక్షణ కోసం అమెరికా సైన్యాన్ని పంపే ప్రతిపాదన ఏమీ లేదన్నారు. నాటో దేశాల్లోని తూర్పు సరిహద్దుల రక్షణ కోసం మాత్రం అదనపు బలగాలను పంపాల్సి ఉందన్నారు. ఈ విషయాన్ని పుతిన్‌కు తాను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నానని, ఉక్రెయిన్‌పై రష్యా దళాలు దాడి చేస్తే కనుక ఆ తర్వాత భయంకరమైన ఆర్థిక ఆంక్షలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :