Radha Spaces ASBL

చైనా దూకుడుకు కళ్లెం..?

చైనా దూకుడుకు కళ్లెం..?

డ్రాగన్ కంట్రీ దూకుడుకు కళ్లెం వేయడంపై అగ్రరాజ్యం అమెరికా దృష్టి సారించింది. ముఖ్యంగా ఇటీవలే అమెరికా భూభాగంపై చైనా బెలూన్ కూల్చివేత, తైవాన్ కు సంబంధించి డ్రాగన్ సైనిక విన్యాసాలతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండడంతో.. వాటిని చల్లార్చేందుకు చర్చల ప్రక్రియను ప్రారంభించే దిశగా అడుగులేస్తోంది. ముఖ్యంగా యూఎస్ రక్షణ సలహాదారు ఆస్టిన్.. సింగపూర్ ఢిఫెన్స్ సమ్మిట్ లో చైనా కౌంటర్ పార్ట్ లీ షంగ్ ఫూతో సమావేశం కావడం ప్రాదాన్యం సంతరించుకుంది. దీన్ని అమెరికా స్వాగతించగా.. చైనా తోసిపుచ్చింది.

ప్రస్తుతం పరిణామాల నేపథ్యంలో అమెరికా-చైనా రక్షణ రంగం, మిలటరీ మధ్య అనుమానాల తొలగింపు కీలకమని యూఎస్ రక్షణ సలహాదారు ఆస్టిన్ తెలిపారు. ఇందుకోసం చర్చల ప్రక్రియ ప్రారంభించడం అవసరమన్నారు. అయితే ఇటీవలి కాలంలో అమెరికా అనుసరిస్తున్న విధానంపై చైనా గుర్రుగా ఉంటోంది. అందుకే తమ మినిస్టర్ పై ఉన్న ఆంక్షల్ని తొలగిస్తేనే చర్చల అంశాన్ని పరిశీలిస్తామంటోంది డ్రాగన్ కంట్రీ.

ఆసియాలో చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేలా అమెరికా పావులు కదుపుతోంది. భారత్ తో రక్షణ బంధాన్ని బలోపేతం చేసుకోవడంతో పాటు క్వాడ్ కూటమి ఏర్పాటులోనూ కీలక భూమిక పోషించింది. తైవాన్ కు ఆయుధ, రక్షణ వ్యవస్థను అందించడంతో పాటు...అవసరమైన సందర్భాల్లో సముద్రతీరాల్లోకి నౌకలను పంపిస్తోంది. ఓవైపు సైనికపరంగా చైనాకు చెక్ చెబుతూనే.. చర్చలను పునరుద్ధరించాలని చూస్తోంది.

కొన్నినెలల క్రితమే  చైనా, అమెరికా మధ్య ఉన్నతస్థాయి సంబంధాలు నిలిచిపోయాయి. ఇతర ఉన్నత స్థాయి సిబ్బంది మధ్య సంప్రదింపులు కొనసాగుతున్నాయి. గతనెల్లోనే సీఐఏ డైరెక్టర్  విలియం బర్న్స్.. చైనా పర్యటన పూర్తి చేశారు. మరోవైపు... ఆస్టిన్ .. చైనా ప్రతినిధితో సమావేశమయ్యారు. ఆసియా పర్యటనలో భాగంగా ముందుగా జపాన్ లో పర్యటించిన ఆస్టిన్... తర్వాత ఇండియాలోనూ పర్యటన చేయనున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే...చైనా- అమెరికా మధ్య సంబంధాలు సాదారణ స్థితికి తెచ్చేందుకు ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నట్లు కనిపిస్తోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :