Radha Spaces ASBL

అమెరికా పౌరుడికి వందేండ్ల జైలు శిక్ష

అమెరికా పౌరుడికి వందేండ్ల జైలు శిక్ష

భారత సంతతికి చెందిన చిన్నారిని కాల్చి చంపిన అమెరికా పౌరుడికి అక్కడి కోర్టు వందేండ్ల జైలు శిక్ష విధించింది. మియా పటేల్‌ అనే బాలిక మృతికి కారణమైన జోసఫ్‌ లీ స్మిత్‌ అనే వ్యక్తిని గత జనవరిలోనే కోర్టు దోషిగా నిర్ధారించింది. లూసియానాలోని మాంక్‌ హౌస్‌ డ్రైవ్‌లోని ఒక హోటల్‌ గ్రౌండ్‌  ఫ్లోర్‌లోని రూములో పటేల్‌ ఆడుకుంటుండగా తుపాకీ బుల్లెట్‌ ఆమె తలపై దూసుకెళ్లింది. దవాఖానకు తీసుకెళ్లగా చికిత్సపొందుతూ మరణించింది. ఆ హోటల్‌కు విమల్‌, స్నేహ పటేల్‌ యజమానులు. వారు మియాపటేల్‌, మరో బంధువుతో హోటల్‌ లోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉంటున్నారు.  అయితే నిందితుడు స్మిత్‌ పార్కింగ్‌ ప్రదేశంలో మరో వ్యక్తితో గొడవపడి అతనిపై 9 ఎంఎం హ్యాండ్‌గన్‌తో కాల్పులు జరిపాడు. అయితే ఈ బుల్లెట్‌ గురితప్పి గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని గదిలో ఆడుకుంటున్న మియాకు తగలడంతో ఆమె మరణించింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :