భారత్-అమెరికా మధ్య ప్రతిష్ఠాత్మక రోడ్ మ్యాప్ ఖరారు

రక్షణ రంగంలో పారిశ్రామిక సహకారాన్ని మరింత పెంపొందించుకునే దిశగా భారత్, అమెరికా తాజాగా ప్రత్యేక రోడ్‌మ్యాప్‌ను రూపొందించుకున్నాయి. ఈ ప్రణాళికలో భాగంగా పలు మిలిటరీ ప్లాట్‌ఫాంలు, హార్డ్‌వేర్‌లను సంయుక్తంగా అభివృద్ధి చేసే ప్రాజెక్లుకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నాయి. ఉక్రెయిన్ సంక్షోభం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడు నేపథ్యంలో ప్రస్తుత పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్ పర్యటనకు వచ్చిన అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఢిల్లీలో భేటీ అయ్యారు. రక్షణ రంగంలో పరస్పర సహకారంపై వారు విస్తృతంగా చర్చలు జరిపారు. రక్షణ పారిశ్రామిక సహకారంపై ప్రత్యేక ప్రణాళికను ఈ భేటీలో వారు ఖరారు చేశారు.
అనంతరం సంబంధిత వివరాలను మీడియా సమావేశంలో ఆస్టిన్ వెల్లడిరచారు. ఇండో పసిఫిక్‌లో స్వేచ్ఛాయుత వాతావరణానికి భారత్-అమెరికా భాగస్వామ్యం మూలరాయి. ఇరు దేశాల మధ్య సైనిక సహకారం పెరుగుతుండటం అంతర్జాతీయంగా శుభ పరిణామం. ఈ నేపథ్యంలో రాబోయే కొన్నేళ్లపాటు పలు ప్రాజెక్టు సంయుక్త అభివృద్ధి, ఉత్పత్తి కోసం ప్రతిష్ఠాత్మక రోడ్‌మ్యాప్‌ను రూపొందించుకున్నాం. దీనివల్ల ఇరు దేశాల రక్షణ పారిశ్రామిక బంధం మరింత బలపడుతుంది అని ఆయన పేర్కొన్నారు.






