Radha Spaces ASBL

ఉప్పల్ అతి త్వరలో గచ్చిబౌలి ఆఫ్ ఈస్ట్ హైదరాబాద్ అవుతుంది : నంద కిషోర్ ఎండీ. రాంకీ ఎస్టేట్స్

ఉప్పల్ అతి త్వరలో గచ్చిబౌలి ఆఫ్ ఈస్ట్ హైదరాబాద్ అవుతుంది : నంద కిషోర్ ఎండీ. రాంకీ ఎస్టేట్స్

రాంకీ ఎస్టేట్స్‌ 27 సంవత్సరాలుగా అనేక హౌసింగ్‌ ప్రాజెక్టులు చేస్తూ అగ్రగామి రియల్‌ ఎస్టేట్‌ సంస్థలతో ఒకటిగా నిలిచింది. ఆ సంస్థ మేనేజింగ్‌ డ్కెరెక్టర్‌ నందకిషోర్‌ ఇటీవలే  అమెరికా వచ్చి 5 పట్టణాలలో అనేక మంది ఎన్‌ఆర్‌ఐలను కలిశారు. ఆ సందర్భంలో ఇప్పటి రాంకీ గ్రూప్‌ నుంచి వస్తున్న ప్రతిష్ఠాత్మకమైన రాంకీ జెన్‌ నెక్స్ట్‌ టవర్‌ గురించి తెలుగు టైమ్స్‌కు వివరంగా తెలిపారు.

రాంకీ గ్రూప్‌ గురించి

రాంకీ గ్రూప్‌ అనగానే అందరికి తెలిసినవి హౌజింగ్‌ ప్రాజెక్టులే. వాటితో పాటు దేశంలోని 23 రాష్ట్రాలలో దాదాపు 500కి పైగా అనేక ప్రాజెక్ట్‌లను వాటర్‌, వేస్ట్‌ మేనెజ్‌మెంట్‌, ఇంజనీరింగ్‌, పబ్లిక్‌ -ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌లో  రాంకీ సంస్థ చేపట్టి విజయవంతంగా పూర్తి చేసిన సంగతి చాలా మందికి తెలీదు.  దాదాపు 4500 ఉద్యోగస్తులతో, పూర్తిస్థాయి జూతీశీటటవంంఱశీఅaశ్రీ మేనేజిమెంట్‌తో, పూర్తిస్థాయి పారదర్శకతలో పని చేసే సంస్థగా రాంకీ గుర్తింపు తెచ్చుకుంది. రాంకీ చేసినవి, పూర్తి చేసిన అపార్టుమెంట్‌లు, విల్లా ప్రాజెక్టులు, కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులలో ఎన్నో ఉన్నాయి.

ఈస్ట్‌ హైదరాబాద్‌ గురించి

వెస్ట్‌ హైదరాబాద్‌ (మాదాపూర్‌, గచ్‌బౌలి పైనాన్సియల్‌ డిస్ట్రిక్ట్‌, కోకపేట..) ఏ విధంగా అభివృద్ధి చెందింది.. సైబరాబాద్‌గా మారింది అందరికి తెలుసు. అయితే పెరిగిన ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు అనుగుణంగా మిగతా మౌళిక సదుపాయాలు పెరిగే అవకాశం లేకపోవడం వలన, అందరూ ఇబ్బంది పడుతున్నారు. కేవలం  30శాతం - 35 శాతం ఉద్యోగస్తులు మాత్రమే ఆఫీసులకు వెళుతుండగా (మిగతవారు వర్క్‌ ఫ్రం హోమ్‌) ఇల్లు - ఆఫీసుల రాకపోకలకు ట్రాఫిక్‌ జామ్‌ల కారణంగా 3-4 గంటల సమయం పడుతోంది. అందువలన ఉద్యోగస్తులు, యాజమాన్యం కూడా చాలా అసహనంగా ఉన్నారు. ప్రభుత్వం కూడా ఈ పరిస్థితిని గమనించి హైదరాబాద్‌ ఈస్ట్‌ సైడ్‌ (కొంపల్లి, నాచారం, తార్నాక, దిల్‌సుఖ్‌ నగర్‌ మొదలైనవి) ఐటీ పార్క్‌ల నిర్మాణం ప్రారంభించి, ఈస్ట్‌ హైదరాబాద్‌లో ఒక ఐటీ కారిడార్‌ను తయారు చేస్తోంది. ఆ ఆలోచనలో భాగంగా LEAP (లుక్‌ ఈస్ట్‌ పాలసీ), GRID (గ్రోత్‌ ఇన్‌ డిస్పర్షన్‌) అనే  రెండు ప్రభుత్వ పథకాలను ప్రవేశపెట్టి అమలులోకి తెచ్చింది. ఈ పథకాల వలన ఇప్పటికే 35 ఎకరాలలో 5 ఐటీ  పార్క్‌లు ప్రభుత్వ ప్రోత్సాహాలతో ప్రారంభం అవుతున్నాయి. అనేక సంవత్సరాలుగా ఉన్న ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో కూడా పారిశ్రామికవేత్తలను ఐటీ పార్క్‌లు కట్టమని ప్రోత్సహిస్తోంది. ఇవి అన్నీ కూడా ప్రారంభమై అనేక దశల నిర్మాణంలో ఉన్నాయి.

ఉప్పల్‌ గురించి

ఈస్ట్‌ హైదరాబాద్‌ ప్రాంతంలో ఉప్పల్‌  ఏరియా బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం అని అందరికీ తెలుసు. ఉప్పల్‌ ఏరియాలో అనేక  పబ్లిక్‌ స్కూల్స్‌, హాస్పిటల్స్‌, మాల్స్‌, సినిమామల్టీపెక్స్‌  థియేటర్స్‌లు, రెస్టారెంట్స్‌ రావడం వలన ఈ ప్రాంతం కమర్షియల్‌ ప్లేస్‌గా కనిపిస్తోంది.  ఇప్పటికే మెట్రోరైలు  వలన,  ఈ ఏరియా అన్ని విధాలుగా అభివృద్ధిలో ముందుంది. దీంతో ఈ ప్రాంతంలో నివసించడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. 

తెలంగాణ ప్రభుత్వ ఐటీశాఖ మంత్రి కేటీ రామారావు, ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్‌ అమెజాన్‌, విప్రో లాంటి పెద్ద ఐటీ సంస్థల నుంచి చిన్న ఐటీ సంస్థలకు వరకు అందరిని ఈస్ట్‌ హైదరాబాద్‌లో వారి వారీ తదుపరి విస్తరణ ప్రాజెక్టులను చేపట్టాలని సూచనలు చేస్తున్నారు. కాబట్టి  జెన్‌ నెక్ట్స్‌ టవర్‌లో పూర్తిగా తయారయ్యేసరికి (3 సంవత్సరాలు) మరికొన్ని పెద్ద సంస్థలు కూడా ఇక్కడకు వస్తాయని నమ్మకంగా ఉన్నాము.

ప్రస్తుత ఆఫీస్‌ గురించి...

ప్రస్తుతం ప్రాధమిక దశలో ప్రీలాంచ్‌లో ఉన్న ఆఫర్‌ ఇస్తున్నామని, ఈ సంవత్సరం చివరి వరకు ఈ ఆఫర్‌ ఉంటుంది. ఒక వ్యక్తి గానీ, కొందరు వ్యక్తులు కలిసి గాని జెన్‌నెక్ట్స్‌లో కొనుగోలు చేయవచ్చు. అలాగే లీజ్‌ అయిన స్పేస్‌ను లేదా లీజ్‌ అవని స్పేస్‌ ని కొనుగోలు చేయవచ్చు. పూర్తి డబ్బులు ఒకేసారి కట్టడం లేదా కొంచెం డబ్బులు ఇప్పుడు పే చేసి  బ్యాంక్‌ లోన్‌ ద్వారా లేదా వాయిదాల రూపంలో కూడా మిగతా డబ్బును కట్టవచ్చు. ఎంఎన్‌సీ సంస్థ ఇచ్చే లీజ్‌ పేమెంట్‌ ఆ స్పేస్‌ యజమానికి చెందుతుంది. రాంకీ గ్రూపు కేవలం అసెట్‌ మేనెజర్‌గా  వ్యవరిస్తూ టవర్స్‌ మెయింటెనెన్స్‌, లీజ్‌ రెంటల్‌ అగ్రిమెంట్‌ లాంటి పనులు అతి తక్కువ ఫీజులో చేస్తుంది.

రామ్‌కీ సంస్థ పాలసీ గురించి ..

ఇన్ని సదుపాయాలు, ప్రభుత్వ సహకారం ఉన్నా జెన్‌ నెక్ట్స్‌ టవర్‌కి భాగస్వామ్యం తీసుకోవటానికి అనేక పెద్ద పెద్ద బిజినెస్‌ సంస్థలు ముందుకు వస్తాయి. కానీ 27 సంవత్సరాలుగా హౌజింగ్‌ ప్రాజెక్టులో పేరు తెచ్చుకొన్న మా సంస్థ  వ్యక్తులను భాగస్వామ్యం చేయడం ద్వారా ముందుకు వెళ్ళటానికి నిర్ణయించుకోంది. ఒక పెద్ద బిజినెస్‌ సంస్థ భాగస్వామ్యం కంటే అనేక మంది వ్యక్తులు భాగస్వాములుగా ఉంటే,  వారు మా హౌజింగ్‌ ప్రాజెక్టులకు  కూడా ఆకర్షితులు అవుతారని మా నమ్మక్మం.

రాంకీ జెన్‌ నెక్స్ట్‌ టవర్స్‌ గురించి...

రాంకీ ఎస్టేట్స్‌ ఈ సంవత్సరం ఉప్పల్‌ (హైదరాబాద్‌)లో 2.1 మిలియన్‌ స్క్వేర్‌ఫుట్‌ ఏరియాతో, 11 అంతస్తుల కమర్షియల్‌ కాంప్లెక్స్‌కు శ్రీకారం చుట్టింది.  GRID-A కొలమానంతో  టవర్‌ ఏ, టవర్‌ బీగా నిర్మితమయ్యే ఈ  ప్రాజెక్టు అనేక పెద్ద  మధ్య  కంపెనీలకు నిలయంగా ఉండబోతుంది. ఇప్పటికే దాదాపు గా 8 లక్షల స్క్వేర్‌ఫీట్‌ ఏరియాని  ఒక ఎంఎన్‌సీకి 15 సంవత్సరాల లీజ్‌కు ఇవ్వడమే కాకుండా మరికొన్ని కంపెనీలతో కూడా లీజ్‌ కోసం చర్చలు జరుగుతున్నాయి.

ఆధునికత నిర్మాణ పద్ధతులలో ఈ టవర్స్‌ తయారు అవుతున్నాయి. మామూలుగా ఒక  కమర్షియల్‌ ఆఫీస్‌ స్పేస్‌లో ఒక ఉద్యోగికి 100 స్క్వేర్‌ఫీట్‌ చొప్పున లెక్క వేసుకుంటారు. కానీ.. జెన్‌ నెక్ట్స్‌ టవర్స్‌లో  ఎక్కువ సదుపాయాలు (లిఫ్ట్‌ కెపాసిటీ, పార్కింగ్‌ కెపాసిటీ, ఏర్‌ కండిషనింగ్‌ కెపాసిటీ, కారిడార్‌ స్పేస్‌- రెస్ట్‌ రూమ్స్‌ వగైరా) 70 స్క్వేర్‌ఫీట్‌కి ఒక ఉద్యోగి చొప్పున ఏర్పాటు చేసుకోవచ్చు. అందువలన కంపెనీలకు ఈ టవర్స్‌లో ఒక ఉద్యోగికి అయ్యే ఖర్చు గణనీయంగా తగ్గిపోతుంది. ఉదాహరణకు ఒక 1000 స్క్వేర్‌ఫీట్‌ ఆఫీస్‌ స్పేస్‌లో 10 మంది ఉద్యోగస్తులకి బదులు 14 మంది ఉద్యోగస్తులను ఉంచవచ్చు.

మరిన్ని వివరాలకు సంప్రదించండి...

తెలుగు టైమ్స్‌ మార్కెటింగ్‌ విభాగం రాంకీ ఎస్టేట్స్‌తో సమన్వయం చేసి అమెరికాలోని చీRIలకు ఈ జెన్‌నెక్స్ట్‌ టవర్స్‌ కొనుగోలు కార్య క్రమంలో సహాయ పడుతుంది.

Site Address :

CG5X QCJ Ramky One Genext Towers
Genpact Rd, Vignana Puri
Habsiguda, Hyderabad - 500 007
Ph : +1 669302 3302

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :