Radha Spaces ASBL

ఆర్ఆర్ఆర్ ఫై దృష్టి పెట్టిన అధికారులు

ఆర్ఆర్ఆర్ ఫై దృష్టి పెట్టిన అధికారులు

హైదరాబాద్‌ రీజినల్‌ రింగురోడ్డు ఉత్తరభాగం అలైన్‌మెంట్‌కు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఆమోదం తెలిపింది. మూడు వారాల క్రితం తుది అలైన్‌మెంట్‌ను ఖరారు చేయగా తాజాగా దానికి మరో చిన్న సవరణ చేసి తుది అలైన్‌మెంట్‌కు ఆమోదముద్ర వేసింది. హైదరాబాద్‌ చుట్టుప్రక్కల ఏర్పాటు చేయనున్న రీజినల్‌ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే అనుమతి మంజూరు కావడం, అలైన్‌మెంట్‌ కూడా ఖరారు కావడంతో అధికారులు రోడ్డు నిర్మాణంపై దృష్టి సారించారు. 158.6 కి.మీ. నిడివితో రూపొందే ఈ భాగం రోడ్డులో 8 ప్రాంతాల్లో భారీ కూడళ్లు (క్లవర్‌లీఫ్‌ ఇంటర్‌ఛేంజెస్‌) ఏర్పాటు చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎక్స్‌ప్రెస్‌ వేలలో ఇవి మేటిగా ఉండనున్నాయి. ప్రస్తుతానికి నాలుగు వరుసలుగానే ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మితం కానున్నా భవిష్య త్తులో 8 లేన్లకు దీన్ని విస్తరించనున్న నేపథ్యంలో భావి అవసరాలకు సరిపడేలా ఈ ఇంటర్‌ఛేంజ్‌ నిర్మాణాలు రూపుదిద్దుకోనున్నాయి. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులను క్రాస్‌ చేసే చోట దాదాపు 100 మీటర్ల వెడల్పుతో ఎలివేటెడ్‌ కారిడా ర్లను నిర్మించనున్నారు. ఈ క్రాసింగ్స్‌ వద్ద ఇప్పటికే ఉన్న రోడ్ల నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌పైకి వాహనదారులు రావడానికి, ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి దిగువనున్న రోడ్లకు వెళ్లేందుకు ఈ క్లవర్‌లీఫ్‌ ఇంటర్‌ఛేంజెస్‌ అవకాశం కల్పిస్తాయి. సర్వీసు రోడ్లతోనూ అనుసంధాన మయ్యేలా వీటిని నిర్మించనున్నారు.

ఉత్తర భాగానికి కన్సల్టెన్సీ బాధ్యతలు చూస్తున్న కే అండ్‌ జే కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ గతంలో నాలుగు అలైన్‌మెంట్‌ ఆప్షన్లను ఢిల్లీలోని ఎన్‌హెచ్‌ఏఐ కేంద్ర కార్యాలయానికి పంపగా.. ‘ఆప్షన్‌`ఏ’ను ఖరారు చేసింది. మూడేళ్ల క్రితం కన్సల్టెన్సీగా వ్యవహరించిన సంస్థ అలైన్‌మెంట్‌తో పోలిస్తే 1.2 కి.మీ. నిడివిని తగ్గిస్తూ ఈ అలైన్‌మెంట్‌ ఉంది. అయితే ఇందులో అత్యవసరంగా మరో సవరణ చేశారు. దీని ప్రకారం పాత అలైన్‌మెంట్‌కు కేవలం 200 మీటర్ల తేడాతో ఈ కొత్త అలైన్‌మెంట్‌ను 158.645 కి.మీ.గా నిర్ధారించారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :