డొనాల్డ్ ట్రంప్ ఇంట విషాదం.. సోదరి కన్నుమూత

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంట విషాదం నెలకొంది. ట్రంప్ సోదరి మేరియన్ ట్రంప్ బారీ (86) కన్నుమూశారు. న్యూయార్క్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న మేరియన్ మరణించినట్లు తెలిసింది. ట్రంప్‌నకు ఉన్న నలుగురు తోబుట్టువుల్లో మేరియన్ మూడో వ్యక్తి. న్యూజెర్సీలో ఫెడరల్ న్యాయమూర్తిగా పని చేసి 2019లో పదవీ విరమణ పొందారు. గతేడాది ట్రంప్ సోదరుడు రాబర్ట్ ట్రంప్ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.







Tags :