ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

నేను మళ్లీ అధికారంలోకి వస్తే... ఆ హక్కు ఉండదు

నేను మళ్లీ అధికారంలోకి వస్తే... ఆ హక్కు ఉండదు

అమెరికాకు అక్రమంగా వచ్చిన వలసదారులకు పుట్టేవారికి పౌరసత్వ హక్కుల్ని తాను అధికారంలోకి వస్తే రద్దు చేస్తానని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఈ మేరకు వెంటనే ఉత్వర్వులు జారీ చేస్తానని ట్రంప్‌ తెలిపారు.  అమెరికా రాజ్యాంగానికి విరుద్ధం, చిన్నారులకు అమెరికాలో పుట్టుకతో లభించే పౌరసత్వాన్ని ఆ దేశ రాజ్యాంగం 140 సవరణతో అందించారు. దీనికి అమెరికా చట్టసభ 1868లో ఆమోదించింది. ట్రంప్‌ రెండోసారి అధికారం చేపట్టగానే ఈ హక్కును రద్దు చేస్తానని పేర్కొన్నారు. పుట్టిన పిల్లల తల్లిదండ్రుల్లో ఒకరికి అమెరికా పౌరసత్వం లేదా చట్టపరంగా అమెరికాలో నివసించే హక్కు ఉండాల్సిదేని ట్రంప్‌ జారీ చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.  2018లో ట్రంప్‌ ఇటువంటి ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ జారీ చేయాలని ట్రంప్‌ భావించారు. కానీ తర్వాత ఆ దిశగా చర్యలు చేపట్టలేదు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :