MKOne Telugu Times Youtube Channel

ఆఫ‌ర్ ల మీద ఆఫ‌ర్ లు కొట్టేస్తున్న త్రిష

ఆఫ‌ర్ ల  మీద ఆఫ‌ర్ లు  కొట్టేస్తున్న త్రిష

నాలుగు ప‌దుల వ‌య‌సుకు ద‌గ్గ‌ర ప‌డితేనే హీరోయిన్ల‌కు ఛాన్సులు త‌గ్గిపోతూ ఉంటాయి. కానీ తమిళ హీరోయిన్ త్రిష మాత్రం ఈ వ‌య‌సులో కూడా ఆఫ‌ర్ల మీద ఆఫ‌ర్లు కొట్టేస్తుంది. రీసెంట్‌గానే త్రిషకు 40 ఏళ్లు నిండాయి. ఈ వ‌య‌సులో క్యారెక్ట‌ర్ రోల్స్ రావ‌డ‌మే క‌ష్టంగా ఉన్న ఈ రోజుల్లో త్రిష్ మాత్రం హీరోయిన్ గా వ‌రుస ఆఫ‌ర్లు అందుకుంటుంది. 

భారీ సినిమాల్లో లీడ్ రోల్స్‌తో ఫ్యాన్స్ ను ఆక‌ట్టుకుంటున్న త్రిష ఈ మ‌ధ్యే పీఎస్-2లో త‌న అందం, అభిన‌యంతో ప్రేక్ష‌కుల్ని మైమ‌రింప‌చేసింది. మ‌ధ్య‌లో ఇంకేముంది త్రిష సీన్ అంతా అయిపోయింద‌నుకున్నారు కానీ త్రిష ఈ మ‌ధ్య ఓకే చేసిన సినిమాలు, ఆమెకు వ‌స్తున్న ఆఫ‌ర్లు చూస్తే షాక్ అవ‌క త‌ప్ప‌దు. 

ఇప్ప‌టికే త‌మిళ స్టార్ హీరో విజ‌య్ తో లోకేష్ క‌న‌గ‌రాజ్ డైరెక్ష‌న్‌లో లియో లో న‌టిస్తుంది త్రిష‌. ఇప్పుడు అజిత్‌తో కూడా త్రిష న‌టించ‌బోతున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. మ‌గిల్ తిరుమ‌ణి ద‌ర్శ‌క‌త్వంలో లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఈ సినిమాను నిర్మించ‌బోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష ఆల్మోస్ట్ క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్లు స‌మాచారం. 

హీరోయిన్ ల‌కు ఓ వ‌య‌సొచ్చాక హీరోల‌కు ఉండే డిమాండ్ ఉండ‌దు. కానీ న‌య‌న‌తార‌, త్రిష లాంటి హీరోయిన్ల విష‌యంలో మాత్రం ఇది వ‌ర్తించ‌ద‌నే చెప్పాలి. అంతేకాదు మ‌ణిర‌త్నం డైరెక్ష‌న్‌లో క‌మ‌ల్ హాస‌న్ చేయ‌బోయే కొత్త సినిమాలో కూడా త్రిష హీరోయిన్ గా చేయ‌బోతుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఈ వార్త‌ల్లో నిజ‌మెంత‌న్న‌ది తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేవ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

 

 

Tags :