టాలీవుడ్ లో బడ్జెట్ రగడ

టాలీవుడ్ లో బడ్జెట్ రగడ

టాలీవుడ్‌లో ఇప్పుడు హీరోల రెమ్యూనరేషన్‌ గొడవ, భారీ బడ్జెట్‌లతో సినిమాలు నిర్మించడం అందుకు తగ్గట్టుగా కలెక్షన్‌లు రాకపోవడం వల్ల నిర్మాతలు చాలా నష్టపోతున్నారు. ఓవైపు ఓటీటీ వల్ల నష్టాలు వస్తుంటే, మరోవైపు  హీరోలు, వారి అసిస్టెంట్‌లు ఇతరత్రా ఖర్చుల వల్ల సినిమాల నిర్మాణం బాగా పెరిగిపోతోందని నిర్మాతలు వాపోతున్నారు. దీనిపై నిర్మాతలు కలిసి సమావేశం ఏర్పాటు చేసుకుని  హీరోలు తమ రెమ్యూనరేషన్‌ విషయంలో తగ్గించుకునేలా ప్రయత్నిస్తున్నారు. దీనిపై జరిగిన సమావేశంలో భాగంగా షూటింగ్‌లు బంద్‌ చేయాలని అనుకున్నారు.  అదే సమయంలో సమస్యను మరీ తెగేదాక లాగకుండా సంప్రదింపులను కొనసాగిస్తూ హీరోలను, ఇతరులను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఓటీటీ వల్ల సినిమాలు పెద్దగా ఆడకపోవడంపై కూడా దృష్టి సారించారు. దీనిపై కూడా చర్చించి నిర్ణయం తీసుకున్నారు... టాలీవుడ్‌ హీరోలు నిర్మాతల మండలి తీర్మానంపై ఏ విధంగా స్పందించనున్నారన్న విషయంపై ఇంతవరకు పెద్దగా క్లారిటీ లేదు. నిర్మాతలు కష్టాల్లో పడి నష్టాల పాలైతే అది సినిమా రంగాన్ని దెబ్బ తీస్తుందని అందువల్ల ఈ విషయంలో ఏదో విధంగా సమస్య పరిష్కారమయ్యేలా చూడాలని అందరూ కోరుకుంటున్నారు.

- లంకా రాంబాబు వర్మ సినిమా జర్నలిస్ట్ 

 

కరోనా తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్‌ విలువ పెరిగిపోయింది. ఇంట్లో కూర్చోని సినిమాలు, వెబ్‌ సిరీస్లు చూస్తున్నారు జనం.  మనకు నచ్చిన మూవీ, సిరీస్‌ వేరే భాషలో ఉన్నపుడు దానిని తెలుగులో కూడా చూసే అవకాశం ఉండడంతో ప్రేక్షకులు ఆకర్షితులవుతున్నారు. ఏ సినిమా అయినా పది రోజుల్లో మన ఇంట్లోనే చూసుకోవచ్చనే ఫిక్స్‌ అవుతున్నాడు.  థియేటర్‌లో సినిమా చూసే పరిస్థితి లేదు, చూడాలంటే తలకు 300 వందల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఆ కారణంగా  థియేటర్లు మూసే పరిస్థితి ఏర్పడిరది. ఓ పక్క సినిమా బడ్జెట్‌ ఆకాశాన్ని అంటుతోంది. మరో పక్క సినీ కార్మికులు వేతనాల పెంచాలని... సినిమా సక్సెస్‌ రేటు తగ్గడం... ఈ అయోమయ పరిస్థితుల్లో వున్నా టాలీవుడ్‌ ప్రముఖులు ఆగష్టు 1 నుండి షూటింగులు బంద్‌ చేసారు.  టికెట్‌ రేట్స్‌  RRR, మరియు ఖGఖీ2 వంటి సినిమాలు టిక్కెట్‌ ధరల పెరుగుదలతో భారీ లాభాలను పండిరచాయి. కానీ అదే అధిక ధర చిరంజీవి నటించిన ఆచార్యపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. మహేష్‌ బాబు నటించిన సర్కారువారి పాట సినిమా టికెట్‌ ధర పెంపుతో రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు నష్టాన్ని నమోదు చేసింది. టికెట్‌ రేట్‌ తగ్గించిన వెంకటేష్‌, వరుణ్తేజ్‌ నటించిన ఎఫ్‌3 కూడా బాక్సాఫీస్‌ నుండి లాభాలను వసూలు చేయలేకపోయింది. జూన్‌లో విడుదల అయినా విరాటపర్వం, సమ్మతమే, చోర్‌ బజార్‌, 7డేస్‌ 6నైట్స్‌, కొండా, గాడ్సే, అంటే సుందరానికి, కిన్నెరసాని, మేజర్‌, విక్రమ్‌ అన్ని సినిమాలలో కేవలం థియేటర్‌లో రన్‌ అయినా సినిమాలు రెండే రెండు అవి మేజర్‌, విక్రమ్‌. ఇంతవరకు బాగానే వుంది. కానీ... జులై నెలలో ఏకంగా చిన్న పెద్ద సినిమాలన్నీ కలిపి షుమారు 20 వరకు విడుదల అయ్యాయి. వాటిలో ఏ ఒక్కటి మూడు రోజులకంటే ఎక్కువగా ఒక్క థియేటర్లలో కూడా నిలబడలేకపోయింది. కారణం ప్రేక్షకుడు సినిమా థియేటర్‌లో మాత్రమే చూడాలనుకున్న కంటెంట్‌ లేకపోవడమే. బింబి సారా, సీతా రామం పలితాలతో  సరైన కంటెంట్‌ వుంటే చాలు జనాలకు థియేటర్‌కు వస్తారనే సింపుల్‌ క్లారిటీ వచ్చేసింది.

ప్రొడ్యూసర్‌ గిల్డ్‌ నిర్ణయాలకు హీరోలు కట్టుబడి వుంటారా? 

ఇంతకు ఆ సంఘటన ఏమిటంటే?  ప్రొడ్యూసర్‌ గిల్డ్‌ తీర్మానాన్ని అనుసరించి, అగ్రహీరోలు కొంత మంది తమ పారితోషకాలు తగ్గించుకుంటా మని ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. కానీ ఇంత జరిగినా... ఇటీవల కార్తికేయ2 హీరో నిఖిల్‌.. హీరోయిన్‌ అనుపమ, కమెడియన్‌ హర్ష కలిసి వైజాగ్‌ ప్రచారానికి వెళ్లారు. ఫ్లయిట్‌ టికెట్లు వేసుకుని వెళ్లి వచ్చి వుంటే మహా అయితే యాభై వేలు కూడా ఖర్చు కాదు. కానీ స్టార్‌ హీరోలు అంతా చార్టర్‌ ఫ్లయిట్‌ వేసుకుని తిరుగుతున్నారు. మనం ఎందుకు తిరగకూడదు అనుకున్నాడేమో హీరో నిఖిల్‌ టీం 12 లక్షల వరకు ఖర్చు చేసి ప్రైవెట్‌ విమానంలో వైజాగ్‌ ప్రచారానికి వెళ్లారు. నిఖిల్‌ లాంటి హీరోలే ఖర్చు విషయంలో ఆలోచించక నిర్మాతకు భారమైనపుడు మార్కెట్‌ వున్నా హీరోలు తగ్గేది లే అనరా! ఇచ్చే నిర్మాత ఉంటే మేము ఎందుకు తగ్గుతాము అనరా? ఇదంతా చూస్తుంటే ఇలాంటి వృధా ఖర్చులు పెట్టే నిర్మాతలు అంతా కలిసి నిర్మాణ వ్యయం తగ్గించేస్తారు అంటే నిజంగా నమ్మబుద్ది అవుతోందా? ఇది ఎంతవరకు అమలు చేస్తారనడం సందేహమే?

ప్రొడ్యూసర్‌ గిల్డ్‌పై విముఖత చూపుతున్న కొంత మంది హీరోలు   

ప్రొడ్యూసర్‌ గిల్డ్‌పై కొంత మంది హీరోలు విముఖత వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయంలో గిల్డ్‌ వ్యవహారాల పట్ల ఆగ్రహంతో వున్న నందమూరి బాలకృష్ణను ప్రసన్నం చేసుకోవడానికి కార్యాచరణ మొదలైంది. ముఖ్యంగా గిల్డ్‌కు సారథ్యం వహిస్తున్న దిల్‌ రాజు పట్ల, ఆయన వ్యవహారాల పట్ల బాలయ్య ఆగ్రహంతో వున్నారని వార్తలు వచ్చాయి.  తమ సినిమా షూట్‌ స్టార్ట్‌ చేయకపోతే ఏమవుతుందో అని నిర్మాతలు మైత్రీ మూవీస్‌ భయపడుతున్నారు. మరోపక్కన బాలయ్య కనుక షూట్‌ ప్రారంభిస్తే మిగిలిన హీరోలు కూడా అదే బాట పడతారని గిల్డ్‌ పెద్దలు భయపడుతున్నారు. ముఖ్యంగా తన పరువు పోతుందని దిల్‌ రాజు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు పరిష్కార మార్గంగా ఈ రోజు జరిగిన గిల్డ్‌ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకున్నారు. బాలయ్యకు నచ్చ చెప్పగల అయిదుగురు నిర్మాత లతో ఓ కమిటీ వేసారు. ఈ కమిటీకి గిల్డ్‌ సారథి దిల్‌ రాజు దూరంగా వుండడం విశేషం. గతంలో బాలయ్య సినిమాలు తీసిన శివలెంక ప్రసాద్‌ ఈ కమిటీలో వున్నారు. ఈయన అంటే బాలయ్యకు అభిమానం గౌరవం వుంది. అలాగే అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో బాలయ్యతో సినిమా నిర్మించనున్న గారపాటి సాహు కూడా మరో సభ్యులు. అలాగే గోపి ఆచంట, అన్నే రమేష్‌, పి కిరణ్‌ కూడా సభ్యులుగా వున్నారు. బాలకృష్ణ తన మీద ఆగ్రహంతో వున్నారని వార్తలు రావడం వల్లనే దిల్‌ రాజు కమిటీకి దూరంగా వున్నారని తెలుస్తోంది. అలాగే తమ సినిమా వ్యవహారం కావడం వల్ల మైత్రీ మూవీస్‌ అధినేతలు కూడా దూరంగా వున్నారు.

థియేటర్‌ హిట్స్‌ 2 శాతమే 

RRR, KGF2 వంటి సినిమాలు టిక్కెట్‌ ధరల పెరుగుదలతో భారీ లాభాలను పండిరచాయి. కానీ అదే అధిక ధర చిరంజీవి నటించిన ఆచార్యపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. మహేష్‌ బాబు నటించిన సర్కారువారి పాట సినిమా టికెట్‌ ధర పెంపుతో రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు నష్టాన్ని నమోదు చేసింది. టికెట్‌ రేట్‌ తగ్గించిన వెంకటేష్‌ మరియు వరుణ్తేజ్‌ నటించిన ఎఫ్‌3 కూడా బాక్సాఫీస్‌ నుండి లాభాలను వసూలు చేయలేకపోయింది. జూన్‌లో విడుదల అయినా విరాట పర్వం,సమ్మతమే, చోర్‌ బజార్‌, 7డేస్‌ 6నైట్స్‌, కొండా, గాడ్సే, అంటే సుందరానికి, కిన్నెరసాని, మేజర్‌, అండ్‌ విక్రమ్‌ అన్ని సినిమాలలో కేవలం థియేటర్‌లో రన్‌ అయినా సినిమాలు రెండే రెండు అవి మేజర్‌, విక్రమ్‌. ఇంతవరకు బాగానే వుంది.  కానీ... జులై నెలలో ఏకంగా చిన్న పెద్ద సినిమాలన్నీ కలిపి షుమారు 20 వరకు విడుదల అయ్యాయి. వాటిలో ఏ ఒక్కటి మూడు రోజులకంటే ఎక్కువగా ఒక్క థియేటర్లలో కూడా నిలబడలేక పోయింది.

ఓటిటిలో అంతర్జాతీయ సినిమాలు అతనికి కావలసిన సినిమాని అతనికి తెలిసిన భాషల్లో చూడటానికి ప్రేక్షకుడు అలవాటు పడ్డాడు. ఇక్కడ థియేటర్‌లో సినిమా చూడాలంటే ఓ RRR, KGF లాంటి సినిమాలు రావాలి! ఈ రేంజ్‌ సినిమాలు ఏడాది ఎన్ని వస్తాయి మహా అయితే 5 సినిమాలు. అయితే ఆగష్టు నెల మంచి కంటెంట్‌తో వచ్చిన  బింబిసారా, సీతారామం చిత్రాలు ఒకే రోజు విడుదల అయ్యి మంచి శుభారంభాన్ని ఇచ్చాయి. చాలా కాలం తరవాత టాలీవుడ్‌లో ఒక మంచి పరిణామం. ఓ సినిమా తొలి మూడు రోజుల్లో దాదాపు బ్రేక్‌ ఈవెన్‌ కు రావడం అన్నది సామాన్యమైన విషయం కాదు. ఇటీవల కాలంలో మరే సినిమా సాధించని ఫీట్‌ ఇది. బింబిసార సినిమాకు తొలి మూడు రోజుల్లో బయ్యర్లు సేఫ్‌ కావడం, నిర్మాతకు ఓవర్‌ ఫ్లోస్‌ స్టార్ట్‌ కావడం అంటే చిన్న విషయం కాదు. అందులోనూ దీని ముందు సినిమా హీరోకి డిజాస్టర్‌. డైరక్టర్‌కు ఇదే తొలి సినిమా.

అందుకే నిర్మాతలు సినిమాను దిల్‌ రాజు దగ్గర వుంచి, ఏం చేయాలనిపిస్తే అది చేయండి అంటూ బాధ్యత అప్పగించారు. కళ్యాణ్‌ రామ్‌, శిరీష్‌ సినిమా చూసిన తరువాత నుంచి మౌత్‌ టాక్‌ మొదలయింది. చాలా అద్భుతంగా వుందని వాళ్లు ఇద్దరూ అడిగిన వారికి అడగని వారికి చెప్పడం ప్రారంభించారు. అంతే కాదు, తమ స్వంత సినిమాలు అన్నీ చేసే రెగ్యులర్‌ బయ్యర్లకు సినిమాను రీజనబుల్‌ రేట్లకు నాన్‌ రిటర్నబుల్‌ అడ్వాన్స్‌ల ప్రాతిపదికన అప్పగించారు. సినిమా మార్నింగ్‌ షో నుంచే జెట్‌ స్పీడ్‌లో లేచింది. మర్నాడు కాస్త డౌన్‌ అయినా, మంచి ఫిగర్స్‌  నమోదు చేస్తూ వచ్చింది. దాంతో బ్రేక్‌ ఈవెన్‌ సులువు అయింది. పైగా  ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ చాలా స్ట్రాంగ్‌ అయ్యారు. ఆర్‌ఆర్‌ఆర్‌ తరువాత జరిగిన సోషల్‌ మీడియా పరిణామాల్లో అటు మెగా ఫ్యాన్స్‌, ఇటు నందమూరి ఫ్యాన్స్‌ అటు ఇటు తలపడ్డారు. దీంతో అటు బాలకృష్ణ.. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఒక్కటిగా నందమూరి ఫ్యాన్స్‌గా మారారు. అది కళ్యాణ్‌రామ్‌కు కూడా కలిసివచ్చింది.   సినిమాకు ఓపెనింగ్‌, టాక్‌ తీసుకురావడానికి ఫ్యానిజం చాలా ఉపయోగపడిరది. ఆ తరువాత కంటెంట్‌ కూడా జనాలకు బాగా నచ్చింది. సినిమాను ముందుకు తీసుకెళ్లిపోయారు. దాంతో కొంత కాలంగా టాలీవుడ్‌ ను అయోమయానికి గురిచేస్తున్న థియేటర్ల అంశం మీద ఓ క్లారిటీ వచ్చేసింది. సరైన కంటెంట్‌ వుంటే చాలు జనాలకు థియేటర్‌కు వస్తారనే సింపుల్‌ క్లారిటీ వచ్చేసింది.

చిరంజీవి సమర్పణలో వచ్చిన ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ ఆగష్టు 11న, మాచర్ల నియోజకవర్గం ఆగష్టు 12న విడుదల అయ్యాయి. ఈ రెండు చిత్రాలు కూడా బాక్స్‌ ఆఫీస్‌ వద్ద బోల్తా కొట్టాయి. మరి ఇదే నెలలో ఇంకా విడుదల కావాల్సిన చిత్రాలలో విజయ్‌ దేవరకొండ, పూరీలా పాన్‌ ఇండియా మూవీ ‘లైగర్‌’ ఆగష్టు 25న విడుదల కానుంది. చియాన్‌ విక్రమ్‌ కోబ్రా, పండుగాడ్‌ ఇంకా మూడు నాలుగు చిత్రాలు విడుదలకు సిద్ధంగా వున్నాయ్‌ వాటి భవిష్యత్‌ ఏ విధంగా వుండబోతుందో వేచి చూడాలి. 

 

ఇక నుండి 50 రోజుల తర్వాత ఓటీటీలో సినిమాల ప్రసారం 

పై విషయాలను దృష్టిలో ఉంచుకుని, థియేటర్లలో విడుదలైన 50 రోజుల తర్వాత రాబోయే సినిమాలను ఓటీటీలో ప్రసారం చేయాలని TFPC కీలక నిర్ణయం తీసుకుంది. మరి తెలుగు సినీ నిర్మాతలు తమ మండలి తీసుకున్న నిర్ణయానికి నిర్మాతలు  కట్టుబడి ఉంటారో లేదో వేచి చూడాలి. అయితే ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ వల్ల సినిమా థియేటర్‌లకు వెళ్లడంపై ప్రతికూల ప్రభావాన్ని గ్రహించిన తర్వాత, తెలుగు ఫిల్మ్స్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ (TFPC) సినిమాలను థియేటర్‌లలో విడుదల చేసిన 50 రోజుల తర్వాత ఓటీటీలో సినిమాలను ప్రసారం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ విధంగా అయినా ఎంటర్టైన్మెంట్‌ కోసం తప్పనిసరిగా ప్రేక్షకుడు సినిమా థియేటర్‌ కు వస్తాడని TFPC భావిస్తోంది. జూలై మొదటి తేదీ నుంచి ఓటీటీ కంపెనీలతో ఒప్పందాలు చేసుకునే సినిమాలపై ఈ నిర్ణయం ప్రభావం చూపుతుంది.

కరోనా తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్‌పై ప్రపంచ భాషల్లో వస్తున్న వేల సినిమాల ప్రభావంతో  ప్రేక్షకుడు అభిరుచి మారింది. ఇకపై రచయితలు, దర్శకులు మారాల్సిన పరిస్థితి ఏర్పడిరది. ఓ స్టార్‌ హీరోతో సినిమా ఈ రోజు మొదలెడితే ఫస్ట్‌ కాపీ రావడానికి కనీసం ఏడాది పడుతుంది. కానీ ఈ రోజు పరిస్థితి ఏడాది తరువాత వచ్చే మార్పుకు అనుగుణంగా కంటెంట్‌ ఇవ్వగలుగుతారా? ఈ రోజు వున్నా టెక్నాలజీ 6 నెలల్లో మార్పు చెంది వేగంగా అప్డేట్‌ అవుతుంది. అదే విధంగా రాబోయే రోజుల్లో వచ్చే మార్పును ఊహించి, అడ్వాన్స్‌గా రచయితలు, దర్శకులు ఆలోచించగలిగి సరికొత్త  కంటెంట్‌తో సినిమాలు తీయగలిగితే  తెలుగు సినీ పరిశ్రమ గత వైభవంతో పునరావృతం అవుతుందని తెలుగు టైమ్స్‌ ఆశిస్తోంది.

ప్రొడ్యూసర్‌ గిల్డ్‌ నిర్మాతలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? 

రెగ్యులర్‌గా చిత్రాలు నిర్మించే కొందరు నిర్మాతలు గిల్డ్‌గా ఫార్మ్‌ అయ్యారు. నిర్మాణ వ్యయం ఎలాగైనా తగ్గించాలని కంకణం కట్టుకున్నారు. ఎలా తగ్గించాలా అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. అందుకోసం కమిటీల మీద కమిటీలు వేస్తున్నారు. డిస్కషన్లు సాగిస్తున్నారు. అందుకోసం సినిమాల నిర్మాణాలు కూడా ఆపేసారు. పైగా టాలీవుడ్‌లో చిత్రమైన వ్యవహారాలు నడుస్తున్నాయి. కానీ గిల్డ్‌ పుణ్యమా అని సినీ వర్గం రెండుగా చీలిపోయినట్లు కనిపిస్తోంది. మొత్తానికి గిల్డ్‌ వ్యవహారాలు యంగ్‌, బిగ్‌ ప్రొడ్యూసర్ల మధ్య వివాదాలకు దారి తీస్తున్నాయి అన్నది వాస్తవం. ఇదంతా చూస్తుంటే నిజంగానే ఖర్చులు తగ్గించేస్తారేమో అని అనుమానం వచ్చేస్తోంది కూడా. దానికి నిదర్శనం ఇటీవల జరిగిన ఓ  సంఘటన చూస్తుంటే టాలీవుడ్‌ నిర్మాతలు ఖర్చు పెంచుకోవడం తప్ప తగ్గించుకోలేరు అని క్లారిటీ వచ్చేసింది.

బయ్యర్‌ నష్టపోతే తిరిగి నష్టాన్ని భర్తీ చేసేవారు ఎందరున్నారు?

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి, రామ్‌ చరణ్‌లు నటించిన ‘ఆచార్య’ సినిమా బాక్స్‌ ఆఫీస్‌ వద్ద బోల్తా పడిరది. దీంతో  డిస్ట్రిబ్యూటర్స్‌  రిస్క్‌ ఫాక్టర్‌లో పడ్డారు. సినిమా విడుదల అయ్యాక నష్టపోయామని ప్రొడక్షన్‌ ఆఫీసులకు తిరగడం మొదలు పెట్టారు.  దీనికి తోడు ఇంకా 250 మంది డిస్ట్రిబ్యూటర్స్‌ చిరంజీవి ఇంటి ముందు ధర్నా చేస్తామని భావించినట్లు సమాచారం. ఆచార్య సినిమా రిలీజ్‌కు ముందే.. భారీ మొత్తంలో థియేట్రికల్‌ హక్కులను డిస్ట్రిబ్యూటర్స్‌కి అమ్మారు. ఆచార్య చిత్రం డిజాస్టర్‌ కావటంతో డిస్ట్రిబ్యూటర్స్‌కు భారీ నష్టాలు వచ్చాయి. ఆచార్య ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ వ్యవహారాలను కొరటాల శివ భుజాలకెత్తుకున్నారు. తర్వాత సినిమా డిజాస్టర్‌ వల్ల డిస్ట్రిబ్యూటర్స్‌కు కలిగిన నష్టాలను తీర్చే బాధ్యతలను కూడా ఆయనే డీల్‌ చేస్తూ వచ్చారు. ఇన్నాళ్లు ఎదురు చూసిన డిస్ట్రిబ్యూటర్స్‌ కొరటాల శివ మాటపై ఆగుతూ వచ్చారు. ఇక ఓపిక పట్టలేక ఇప్పడు ఏకంగా కొరటాల శివ ఆపీసుకి వచ్చి గొడవ పడ్డారని సినీ సర్కిల్స్‌లో వార్తలుగా వినిపిస్తున్నాయి.

కొరటాల శివ ఆఫీసులో 40 మందికి పైగా ఉన్న డిస్ట్రిబ్యూటర్స్‌ను శాంత పరచడానికి కొరటాల శివ, మైత్రీ మూవీ మేకర్స్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యవహారం కుదుటపడలేదు. హ్యాష్‌ ట్యాగ్‌ జస్టిస్‌ ఫర్‌ కొరటాల శివ పేరుతో ట్విట్టర్‌లోనూ విషయం ట్రెండ్‌ అయ్యింది. డిస్ట్రిబ్యూటర్స్‌ గొడవ మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌ చరణ్‌ వరకు చేరడంతో వారు తమ వంతుంగా విషయాన్ని కూల్‌గా సెటిల్‌ చేశారని అంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో పేరున్న బాధ్యత గల వ్యక్తులు చిరంజీవి రామ్‌చరణ్‌లు కాబట్టి  బయ్యర్ల నష్టానికి షుమారు అందులో భాగంగా రూ.20 కోట్ల మేరకు అడ్వాన్సులుగా తీసుకున్న మొత్తాన్ని డిస్ట్రిబ్యూటర్స్‌కు ఇచ్చేశారని సినీ సర్కిల్స్‌లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. మిగిలిన మొత్తాన్ని కొరటాల శివ తీర్చడానికి రెడీ అయినట్లు టాక్‌ వినిపిస్తోంది. మరే ఇతర నిర్మాతలు అంత భాద్యతగా బయ్యర్ల నష్టపోతే వారికీ తిరిగి నష్టాన్ని భర్తీ చేసేవారు ఎందరున్నారు.

ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో సినిమా చూడటానికి ఆసక్తి చూపుతున్న ప్రేక్షకుడు

కోవిడ్‌ మహమ్మారి కాలంలో సింగిల్‌ స్క్రీన్‌లు మరియు మల్టీప్లెక్స్‌లు మూసివేయడంతో, మనకు నచ్చిన మూవీ, సిరీస్‌ వేరే భాషలో ఉన్నపుడు దానిని తెలుగులో కూడా చూసే అవకాశం ఉండడంతో ప్రేక్షకులు ఆకర్షితులవుతున్నారు. ఒక రకంగా ఇది  సినిమా నిర్మాతలకు వరంగా మారింది. ఇంతకు ముందు నిర్మాతలు తమ సినిమాల శాటిలైట్‌ రైట్స్‌ ద్వారా థియేట్రికల్‌ బిజినెస్‌ కాకుండా ఆదాయం పొందేవారు. ఇటీవలి కాలంలో నిర్మాతలు తమ సినిమాల డిజిటల్‌  హక్కులు, డబ్బింగ్‌ హక్కులను అమ్మడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. అయితే  అనుకూల పరిస్థితులతో సాధారణ స్థితికి వచ్చిన తర్వాత, సినిమా ప్రేక్షకుల కోసం సినిమా థియేటర్లు తిరిగి తెరవబడ్డాయి. కానీ పరిస్థితి మారింది మరియు కానీ పరిస్థితి మారింది పైగా ఓటీటీనిర్మాతలకు పీడకలగా మారింది.

థియేటర్‌లో సినిమా చూసేందుకు రూ.300 వెచ్చించే బదులు, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో దాదాపు వార్షిక సభ్యత్వాన్ని పొందవచ్చని సినీ ప్రేక్షకులు వేరే విధంగా ఆలోచిస్తున్నారు. రద్దీ తగ్గడంతో థియేటర్ల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. సినిమా టిక్కెట్ల ధరలు విపరీతంగా పెరగడంతో, సినీ ప్రేక్షకులు సాంప్రదాయ పెద్ద స్క్రీన్‌పై కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో సినిమా చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కోవిడ్‌ సమయంలో సినిమాలను ఓటీటీలో చూసే అలవాటుతో, ఇప్పుడు ప్రజలు డిఫరెంట్‌ కంటెంట్‌ వున్నా సినిమాలకే  థియేటర్లలో సినిమాలు చూడటానికి ఇష్టపడతారు.  ఏ సినిమా అయినా థియేటర్లలో విడుదలైన మొదటి రోజు నెగిటివ్‌ టాక్‌ తెచ్చుకుంటే, మధ్యతరగతి ప్రేక్షకులు పెద్ద స్క్రీన్‌పై చూడటం మానేసి, థియేటర్లలో విడుదలైన రెండు మూడు వారాల తర్వాత ఓటీటీలో ఎలాగైనా పెడతారు కదా అప్పుడే చూడొచ్చు అనే ఆశతో ఎదురు చూస్తున్నారు.

ఎన్‌ఆర్‌ఎ పద్దతి రద్దు చేయాలి: డిస్ట్రిబ్యూటర్లు

టాలీవుడ్‌ సినిమాల డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌నే మార్చేసింది. ఎన్‌ఆర్‌ఎ పద్దతి నాన్‌ రిటర్నబుల్‌ అడ్వాన్స్‌ అనే ఈ పద్దతిలో నిర్మాత సినిమా డిమాండ్‌ మేరకు ఒక్కో ఏరియాకు ఇంత మొత్తం అని అడుగుతాడు. ఇరువైపులా డిస్కషన్లు, సినిమా స్టామినా, కాంబినేషన్‌ అన్నీ చూసి ఆ ఫిగర్‌ ఫిక్స్‌ అవుతుంది. సినిమా విడుదలయిన తరువాత ఈ మొత్తం అంతా వసూలు అయ్యే వరకు డిస్ట్రిబ్యూటర్‌కు గండమే. ఆ మొత్తం దాటిన తరువాత వచ్చేదే లాభం. అందులోంచి 20 శాతం మాత్రం తను తీసుకుని మిగిలినది మళ్లీ నిర్మాతకే ఇవ్వాలి. దాన్నే ఓవర్‌ ఫ్లోస్‌ అంటారు. చిన్న చితక నిర్మాతల సినిమా హిట్‌ అయితే డిస్ట్రిబ్యూటర్లు ఆడేసుకుంటారు. ఓవర్‌ ఫ్లోస్‌ ఇవ్వరు. అదే పెద్ద నిర్మాణ  సంస్థలయితే లెక్కలు అన్నీ కూపీ లాగి మరీ ముక్కు పిండి వసూలు చేస్తాయి. కానీ  సినిమా ఫ్లాప్‌ అయితే డిస్ట్రిబ్యూటర్‌కు ఇబ్బందే.

అయితే గత కొన్నేళ్లుగా సినిమా ఫ్లాప్‌ అయితే ఎన్‌ఆర్‌ఎ మొత్తంలో కొంత మొత్తం నిర్మాత వెనక్కు ఇచ్చే పద్దతి మొదలైంది. అది మొత్తం నష్టం అంతా కాదు. మహా అయితే అందులో 25 శాతం. ఈ పద్ధతి  అజ్ఞాతవాసి సినిమాతో ఇది మొదలైంది. ఇప్పుడు కూడా  అలా కంటిన్యూ అవుతోంది. ఎప్పుడయితే ఇలా వెనక్కు ఇవ్వడం, తీసుకోవడం అలవాటైందో, డిస్ట్రిబ్యూటర్లు కూడా పెద్ద సంస్థల సినిమాలను వెనక ముందు చూడకుండా తీసుకుంటున్నారు. ఎంతో కొంత వెనక్కు ఇస్తారులే అన్న ధీమా. ఇంకో పద్దతి కూడా జస్ట్‌ అడ్వాన్స్‌ మీద సినిమా ఆడిరచడం. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్‌కు రిస్క్‌ వుండదు. కానీ నిర్మాతల చేతిలో పడిన అడ్వాన్స్‌ అంత వేగం తిరిగి రావు. నెక్స్ట్‌ మూవీలో చూసుకుందాం అంటారు. అయితే ఇకపై ఈ పద్దతులు వద్దు అంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు. తాము రిస్క్‌ తీసుకుంటూ, కష్టపడుతూ వుంటే అసలు రావడం లేదు జస్ట్‌ కమిషన్‌ మాత్రమే వస్తోందని అంటున్నారు. గిల్డ్‌-డిస్ట్రిబ్యూటర్ల మధ్య జరిగిన సమావేశంలో ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్లు తెగేసి చెప్పారు.

ఎన్‌ఆర్‌ఎ పద్దతి వద్దు అని. అయితే అడ్వాన్స్‌ మీద పంపిణీ చేస్తాం. అది కూడా తేడా వస్తే సినిమా విడుదలయిన ఇన్ని రోజుల్లో తిరిగి ఇవ్వాలనే నిబంధన వుండాలి. ఆ టైమ్‌ దాటితే వడ్డీలు చెల్లించాలి. లేదా అవుట్‌ రేట్‌ న సినిమా అమ్మేసే పద్దతి వుండాలి. అలా కొనుక్కుంటే రిస్క్‌, లాభం రెండూ తామే పడతామని చెప్పారు. నైంలో బిగ్‌ డిస్ట్రిబ్యూటర్‌ దిల్‌ రాజు కూడా కొంతకాలంగా ఇదే ఆలోచనతో వున్నారు. సినిమాలను ఎన్‌ఆర్‌ఎ పద్దతిని తీసుకోకూడదని, అవుట్‌ రేట్‌లో కొనేసుకోవడం బెటర్‌ అని ఆలోచిస్తున్నారు. అందువల్ల ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం వుంది. కానీ ఈ నిర్యాణానికి నిర్మాతల ఆమోదం తెలుపుతారో లేదో మరి?

 

Tags :