Radha Spaces ASBL

పాటలు, డ్యాన్స్ లు... అతిధుల ప్రసంగాలతో సాగనున్న టిఎల్‌సిఎ స్వర్ణోత్సవ వేడుకలు

పాటలు, డ్యాన్స్ లు... అతిధుల ప్రసంగాలతో సాగనున్న టిఎల్‌సిఎ స్వర్ణోత్సవ వేడుకలు

తెలుగు సంస్కృతీ పరిరక్షణ, విస్తృతపరచడం అన్న లక్ష్యంతో ఏర్పడిన తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం ఇప్పుడు 50 సంవత్సరాల వేడుకలను వైభవంగా జరుపుకుంటోంది. మొదటి నుంచి తెలుగు భాషకు, మన సంస్కృతికీ పెద్దపీట వేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్న టిఎల్‌సిఎ ఈసారి స్వర్ణోత్సవ వేడుకల్లో కూడా తన వైభవాన్ని, తన ఆశయాన్ని చాటలే కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. సాÊనిక కళాకారులకు, తెలుగు యువతకు, చిన్నారుల ప్రతిభకు వేదికగా నిలిచిన టిఎల్‌సిఎ ఈ వేడుకల్లో కూడా వారికి పెద్ద పీట వేస్తూ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 50 సంవత్సరాల గోల్జెన్‌ జూబ్లి వేడుకలను ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు టిఎల్‌సిఎ ప్రెసిడెంట్‌ ఉదయ్‌ దొమ్మరాజు తెలిపారు. ఫ్లషింగ్‌లోని హిందూ టెంపుల్‌ సొసైటీ ఆఫ్‌ నార్త్‌ అమెరికాలో ఈ వేడుకలను శనివారం 20 నవంబర్‌ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నిర్వహిస్తున్నారు. కోవిడ్‌ నిబంధనలను అనుసరించి వేడుకలను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా పలు కార్యక్రమాలతోపాటు పోటీలను కూడా సంఘం నిర్వహిస్తోంది. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా సుమంగళి, శ్రీకాంత్‌ సందుగు, కుమారి మౌనిమ పాటల కార్యక్రమం, టిఎల్‌సిఎ స్వర్ణోత్సవ వేడుకల స్వాగత గీతం, టిఎల్‌సిఎ మహిళల నృత్య కోలాహలం, స్థానిక చిన్నారుల, జానపద, సినీ నృత్య కార్యక్రమం, భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు, సినీ గాయని గాయకుల గానలహరి వంటి ఇలా ఎన్నో కార్యక్రమాలను గోల్డెన్‌ జూబ్లి వేడుకల్లో ప్రదర్శించనున్నాము. ఈ వేడుకల్లో ముఖ్య అతిధులుగా ప్రముఖ దర్శకులు హరీష్‌ శంకర్‌, అవధాన సమ్రాట్‌ మేడసాని మోహన్‌, మాన్వ గారు పాల్గొంటున్నారు. టిఎల్‌సిఎ నాయకులు, సభ్యులతోపాటు ఇతర స్థానిక ప్రముఖులు కూడా ఈ వేడుకలకు హాజరుకానున్నారు. టిఎల్‌సిఎ లక్కీ మహిళల డ్రాలు, చీరల బహుమతులు, కమ్యూనిటీ సర్వీసెస్‌ రికగ్నిజన్‌ అవార్డ్స్‌, అన్నీ కుటుంబాలకు ఆశ్చర్యకరమైన బహుమతులు, పసందైన తెలుగింటి విందుతో కార్యక్రమాలు సాగనున్నాయి. మద్దిపట్ల ఫౌండేషన్‌ లక్కీడ్రాలో గెలిచిన వారికి ఎలక్ట్రానిక్‌ గిఫ్ట్‌ ఐటెమ్‌, 10 గ్రాముల గోల్డ్‌ కాయిన్‌ కూడా ఇస్తున్నారు. ఎన్నో కార్యక్రమాలతో మీ ముందుకు వస్తున్న ఈ వేడుకలకు అందరూ రావాల్సిందిగా కల్చరల్‌ టీమ్‌ చైర్‌ నెహ్రు కటారు, మాధవి కోరుకొండ (కోచైర్‌), అరుంధతి అడుప (కో చైర్‌) ఆహ్వనిస్తున్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :