ASBL Koncept Ambience
facebook whatsapp X

టిల్లు స్వ్కేర్.. వాట్టే ప్లానింగ్ గురూ..

టిల్లు స్వ్కేర్.. వాట్టే ప్లానింగ్ గురూ..

డీజే టిల్లు. ఒకే ఒక్క సినిమా సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ రేంజ్ ను రాత్రికి రాత్రే మార్చేసింది. ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బాగా క‌లెక్ట్ చేయ‌డంతో ప్ర‌స్తుతం దానికి సీక్వెల్ ను తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాకు టిల్లు స్క్వేర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. డీజే టిల్లులో హీరోయిన్ నేహా శెట్టి అయితే, టిల్లు స్వ్కేర్ లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్ గా క‌నిపించ‌నుంది. 

మొద‌ట్లో ఈ సినిమాను ఆగస్టు 11న రిలీజ్ చేద్దామ‌నుకున్నారు కానీ అదే టైమ్ లో భోళా శంక‌ర్, జైల‌ర్, యానిమ‌ల్, గ‌ద‌ర్2 లాంటి సినిమాలు రిలీజ్ అవుతుండ‌టంతో పోట‌టీ ఎందుకులే సోలోగా వ‌చ్చి క‌లెక్ష‌న్లు తెచ్చుకుందాం అనుకుని కొత్త రిలీజ్ డేట్ సెప్టెంబ‌ర్ 15కి సినిమాను లాక్ చేసుకున్నారు. ఈ డేట్ కు టాలీవుడ్ లో ఏ సినిమా షెడ్యూల్ కాలేదు. 

ఇక‌పై షెడ్యూల్ చేసుకున్నా ముందు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసుకున్న టిల్లు స్క్వేర్ కు పెద్ద‌గా ఇబ్బందులుండ‌వు. ఈ రిలీజ్ డేట్ ను చాలా చాక‌చాక్యంగా ప్లాన్ చేశారు సితార నిర్మాత‌లు. సెప్టెంబ‌ర్ 7న బాలీవుడ్ లో షారుఖ్ జ‌వాన్ వ‌స్తోంది కానీ ఆ ఎఫెక్ట్ ఈ సినిమాకు ఏముండ‌దు. జ‌వాన్ రిలీజ్ ఉండ‌టంతో పెద్ద సినిమాలేమీ ఆ టైమ్ కు రిలీజ్ ప్లాన్ చేసుకోలేదు. కాబ‌ట్టి టిల్లు స్వ్కేర్ రిలీజ్ నాటికి థియేట‌ర్లు చాలా పెద్ద మొత్తంలోనే దొరుకుతాయి. 

ఎలాగూ త‌ర్వాత గుంటూరు కారం సినిమా ఇదే బ్యాన‌ర్ కాబ‌ట్టి, ఈ సినిమాకు బయ్య‌ర్లు కూడా బాగానే వ‌స్తారు. గ‌తంలో డీజే టిల్లు టైమ్ లో భీమ్లా నాయ‌క్ ను ముందు పెట్టుకుని ఈ సినిమాకు బిజినెస్ చేసుకున్నారు. ఇప్పుడు కూడా మ‌హేష్ సినిమాను ముందు పెట్టుకుని టిల్లు స్వ్కేర్ కు బిజినెస్ చేయ‌బోతున్నారు. ఏదైనా ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాల్సిన అవ‌స‌రం సిద్దూకి ఎంతైనా ఉంది. అస‌లే ఈ సినిమా కోసం ఏడాదికి పైగా మ‌రే సినిమా చేయ‌కుండా ఉన్నాడు, దానికి తోడు డైరెక్ట‌ర్ ని మార్చ‌డం విష‌యంలో కూడా సిద్దూ హిట్ కొట్టి ప్రూవ్ చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :