'మిస్టర్ బచ్చన్' మాస్ ఫీస్ట్ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్
మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబో 'మిస్టర్ బచ్చన్'తో మరో మాస్ సునామీని సృష్టించడానికి సిద్ధంగా ఉంది. మూవీ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదల కానుంది. ఈ సినిమాకి సంబందించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి, టీజర్‌తో పాటు పాటలు హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేశారు.
రవితేజ చెప్పిన పవర్ ఫుల్, ఇంపాక్ట్ ఫుల్ డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. "సరిహద్దు కాపాడేవాడే సైనికుడు కాదు... సంపద కాపాడేవాడు కూడా సైనికుడే.."అనే డైలాగ్ సినిమాకి టోన్ సెట్ చేస్తుంది. రవితేజ కమాండింగ్ ప్రెజెన్స్ కట్టిపడేసింది.
బచ్చన్ తన ఊర్లో జిక్కీ అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ట్రైలర్‌లోని రెప్పల్ డప్పుల్ అనే హై-ఎనర్జీ నంబర్ ఒక హైలెట్ గా నిలిచింది. పవర్ ఫుల్ వ్యక్తికి వ్యతిరేకంగా ఐటీ దాడులకు నాయకత్వం వహించడానికి హీరో యాక్షన్ లోకి దిగడంతో ట్రైలర్ లో ఇంటెన్స్, కాన్ఫ్లిక్ట్ నెక్స్ట్ లెవల్ కి చేరుకుంది. ట్రైలర్ ప్రామిస్ చేసినట్లుగా, ఈ మూవీ రొమాన్స్, డ్రామా, యాక్షన్ గ్రేట్ బ్లెండింగ్ ని అందిస్తోంది.
టైటిల్ రోల్‌లో రవితేజ పెర్ఫార్మెన్స్, ఎనర్జీ, చరిష్మా అద్భుతంగా వుంది. మాగ్నెటిక్ ప్రెజెన్స్‌తో స్క్రీన్‌పై అదరగొట్టారు. జగపతి బాబు పవర్ ఫుల్ రోల్ ని పోషించారు. తన క్యారెక్టర్ నెరేటివ్ లో ఇంటెన్స్, కాన్ఫ్లిక్ట్ ని యాడ్ చేసింది. భాగ్యశ్రీ బోర్స్ తన అద్భుతమైన గ్లామర్, పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. రవితేజ, భాగ్యశ్రీ లవ్లీ కెమిస్ట్రీని పంచుకున్నారు. సత్య అండ్ గ్యాంగ్ హ్యుమర్ రిలీఫ్ ని అందిస్తున్నారు.
కమర్షియల్ సబ్జెక్ట్‌ని హ్యాండిల్ చేయడంలో హరీష్ శంకర్ తన నైపుణ్యాన్ని మరోసారి చూపించారు. అయనంక బోస్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా వుంది. విజువల్స్ చాలా గ్రాండ్ వున్నాయి. మిక్కీ జె మేయర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా హీరోయిక్ ఎలిమెంట్‌లను మరింత ఎలివేట్ చేస్తోంది.
ప్రతిష్టాత్మకమైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ప్రతి ఫ్రేమ్‌లో గ్రాండియర్ స్పష్టంగా కనిపిస్తుంది. బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైన్ టాప్ క్లాస్ లో వుంది ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ ఎంగేజింగ్ నెరేటివ్ ని అందించింది. ట్రైలర్ సినిమాకి హై స్టాండర్డ్ ని సెట్ చేస్తుంది. బ్రిలియంట్ స్టొరీ టెల్లింగ్, డైనమిక్ పెర్ఫార్మెన్స్, ఎక్స్ ట్రార్డినరీ టెక్నికల్ వర్క్ గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరోయన్స్ ని అందించడానికి ట్రైలర్ ప్రామిస్ చేస్తోంది.