ASBL Koncept Ambience
facebook whatsapp X

హీరో కిరణ్ అబ్బవరం "క" సినిమా నుంచి 'మాస్ జాతర' సాంగ్ విడుదల

హీరో కిరణ్ అబ్బవరం "క" సినిమా నుంచి 'మాస్ జాతర' సాంగ్ విడుదల

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్  ( Kiran Abbavaram)అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్  సినిమా "క" (KA). ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌"క" సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాను త్వరలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు.

"క" సినిమా నుంచి 'మాస్ జాతర ' సాంగ్ ను ఈ నెల 7వ తేదీన విడుదల చేయబోతున్నారు. రేపు ఉదయం 10.05 ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సామ్ సీఎస్ మ్యూజిక్ అందించిన "క" సినిమా నుంచి 'వరల్డ్ ఆఫ్ వాసుదేవ్..' సాంగ్ ఇప్పటికే రిలీజై హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. 'మాస్ జాతర' సాంగ్ మీద కూడా మ్యూజిక్ లవర్స్ లో మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

"క" సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, మలయాళంలో హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫరర్ ఫిలింస్ పై రిలీజ్ చేయబోతున్నారు.

 

 

praneet praneet praneet ASBL Landmark Radhey Skye Radha Spaces
Tags :