ASBL Koncept Ambience
facebook whatsapp X

థియేటర్‌ నుంచి బయటకు వచ్చాక కూడా ఆ ఎమోషన్ వెంటాడుతుంది.. ‘అలా నిన్ను చేరి’ దర్శకుడు మారేష్ శివన్

థియేటర్‌ నుంచి బయటకు వచ్చాక కూడా ఆ ఎమోషన్ వెంటాడుతుంది.. ‘అలా నిన్ను చేరి’ దర్శకుడు మారేష్ శివన్

దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. మంచి ఫీల్ గుడ్ మూవీగా రాబోతున్న ఈ మూవీని విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పిస్తున్నారు. అన్ని రకాల అంశాలను జోడించి ఈ మూవీని మారేష్ శివన్ తెరకెక్కించారు. సుభాష్ ఆనంద్ సంగీత దర్శకుడిగా ఈ చిత్రానికి  కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించారు. ఆస్కార్ గ్రహీత చంద్రబోస్ పాటలు రాయగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఈ చిత్రానికి ఆండ్రూ కెమెరామెన్.. కింగ్ సోలమన్,  రామ కిషన్ యాక్షన్ కొరయోగ్రాఫర్స్. నవంబర్ 10న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ క్రమంలో దర్శకుడు మారేష్ శివన్ మీడియాతో ముచ్చటించారు.

అలా నిన్ను చేరి ప్రయాణం ఎప్పుడు మొదలైంది? కథ ఎప్పుడు రాసుకున్నారు? 

ఈ కథను నేను 2012లో రాశాను.. అదే బ్యాక్ డ్రాప్‌లో కథ జరుగుతుంది. ప్రతీ మనిషిలో జరిగే కథ ఇదే. ప్రేమ, లక్ష్యం ఒకేసారి ఎంచుకోవాల్సి వస్తే ఏం చేస్తారు.. ఏం చేయాలి అనే మెసెజ్‌తో మూవీని తీశాను. చిత్రాన్ని చూసిన తరువాత కొంత మందైనా మారుతారు. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా అదే ట్రాన్స్‌లో ఉంటారు.

మీ నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా కథ రాసుకున్నారా?

నా జీవితం అనే కాదు.. ప్రతీ ఒక్కరి జీవితంలో అలాంటి సంఘటనలు జరిగి ఉంటాయి.. అందరికీ ఈ సినిమా కనెక్ట్ అవుతుంది.. ఈ సీన్ మా లైఫ్‌లో జరిగిందే.. ఆ సీన్ మా జీవితంలో జరిగిందే అని అనుకుంటారు. ఇది 2012లో రాసుకున్న కథే అయినా.. ఇప్పటి వారికి కూడా కనెక్ట్ అవుతుంది. టెక్నాలజీ పరంగా పెరిగినా.. ఎమోషన్స్ మాత్రం అవే ఉంటాయి. అందరికీ ఒకే రకమైన ఎమోషన్స్ ఉంటాయి.

కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా తెరకెక్కించారా?

మా సినిమా కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా. సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికెట్ ఇచ్చింది. మా నిర్మాత గారికి కథ చెప్పడంతోనే తెగ నచ్చేసింది. ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారు. అందుకే అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా చాలా గ్రాండ్‌గా నిర్మించారు.

హీరో దినేష్ తేజ్ ఈ కథలోకి ఎలా వచ్చారు?

హుషారు టైం నుంచి దినేష్ నాకు స్నేహితుడు. ఓ సారి బెక్కెం వేణుగోపాల్ గారికి ఈ కథను చెప్పాను. చివరకు దినేష్‌ వద్దకే ఈ కథ వెళ్లింది. దినేష్ అప్ కమింగ్ యాక్టర్. పాయల్ రాధాకృష్ణ వెబ్ సిరీస్‌లో నటించారు. మిగత వాళ్లు సీనియర్ ఆర్టిస్టులు.

ఈ సినిమా స్టోరీ ఎలా ఉంటుంది?.. కథకు తగ్గ మ్యూజిక్ వచ్చిందా?

ఈ చిత్రం లవ్, ఎమోషన్స్ ప్రధానంగా సాగుతుంది. ఇందులో హీరో తన లక్ష్యాన్ని, ప్రేమను ఎలా సాధించుకున్నాడు అనేది ఇతివృత్తంగా చూపించాం. ఈ చిత్రానికి సంగీతం ప్లస్ అవుతుంది. అద్భుతమైన పాటలు, ఆర్ఆర్, సంగీతాన్ని అందించారు సంగీతదర్శకలు సుభాష్ ఆనంద్. థియేటర్లో జనాలకు గూస్ బంప్స్ వస్తాయి. ఈ సినిమాను, పాటలను చూసి త్రినాథరావు నక్కిన లాంటి దర్శకులు 'ఇది చిన్న సినిమా కాదు.. చాలా పెద్ద హిట్ అవుతుందని' అన్నారు. 'కంటతడి పెట్టించావ్' అని బెక్కెం వేణుగోపాల్ గారు అన్నారు. 'మాటల్లేవ్' అని బెల్లంకొండ సురేష్ గారు ప్రశంసించారు.

సినిమా క్లైమాక్స్ ఎలా ఉండబోతోంది? విషాదంతంగా ముగుస్తుందా?

అది ఇప్పుడే చెప్పలేను.. అదే నా బలం. థియేటర్లో చూస్తే మీకే తెలుస్తుంది.

మీ నేపథ్యం ఏంటి? మీ ప్రయాణం ఎలా సాగింది? 

డైరెక్టర్: నాకు చిన్నప్పటి నుంచే కథలు రాయడం ఇష్టం. రియాల్టీకి దగ్గరగా ఉండాలనే కాన్సెప్టుతోనే ఉంటాను. ఆనంద్ సాయి వద్ద పని చేశాను. పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు పని చేశాను. ఆర్ట్ డైరెక్టర్‌‌కు అసిస్టెంట్‌గా చాలా చిత్రాలు చేశాను. కానీ దర్శకుడు కావాలని లోపల ఉండేది. చాలా కష్టాలు పడ్డ తరువాత ఈ ప్రాజెక్ట్ ప్రారంభం అయింది. ఈ కథను మొదటగా బెక్కెం వేణుగోపాల్ గారికే చెప్పాను. ఇప్పుడు మంచి సినిమాను మిస్ అయ్యానని ఆయన అంటుంటారు.

ఎన్ని థియేటర్లలో రిలీజ్ చేయబోతోన్నారు?

డైరెక్టర్: ముందు 200 థియేటర్లలో విడుదల చేస్తున్నాం. మౌత్ టాక్ బాగుంటే మళ్లీ థియేటర్లు పెంచొచ్చు అని అనుకుంటుంన్నాం.

 

 

praneet praneet praneet ASBL Landmark Radhey Skye Radha Spaces
Tags :