జూలై 22న థియేటర్లలోకి ' థ్యాంక్యూ (The Movie)' చెప్పడానికి వస్తున్నాం!... : దిల్ రాజు

జూలై 22న థియేటర్లలోకి ' థ్యాంక్యూ (The Movie)' చెప్పడానికి వస్తున్నాం!... : దిల్ రాజు

నాగ చైతన్య  హీరోగా 'థ్యాంక్యూ ది మూవీ' అనే చిత్రం రాబోతోంది. జూలై మొదటి వారంలోనే  విడుదల కావాల్సిన  ఈ చిత్రం ఇప్పుడు వాయిదా పడింది నాగ చైతన్య హీరోగా రాశీ ఖన్నా హీరోయిన్‌గా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రాబోతోన్న చిత్రం థ్యాంక్యూ ది మూవీ. ఇక ఇందులో మాళవిక నాయర్, అవికా గోర్‌లు కూడా ముఖ్య పాత్రల్లో కనిపించబోతోన్నారు. ఇది వరకు విడుదల చేసిన పాటలు, పోస్టర్లు, టీజర్ అన్నీ కూడా సినిమా మీద అంచనాలు పెంచేశాయి. ఇక విక్రమ్ కే కుమార్ మార్క్ మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.సినిమాలో చైతన్య మూడు వేరియేషన్లలో కనిపించేట్టు ఉన్నాడు. ఇక మూడు దశల్లోని ప్రేమను విక్రమ్ కే కుమార్ ఎంతో గొప్పగా చూపించినట్టు కనిపిస్తోంది. అయితే ఈ చిత్రం జూలై 8న విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు నిర్మాత దిల్ రాజు ప్రకటించాడు.

"అందరికీ నమస్కారం.. థ్యాంక్యూ.. మీ అందరికీ థ్యాంక్యూ మూవీ గురించి థ్యాంక్స్ చెబుతున్నా.. జూలై 8న ఈ చిత్రాన్ని విడుదల చేద్దామని అనుకున్నాం.. అందుకే అంతా రెడీ చేయాలని అనుకున్నాం. కానీ ఇంకా మూడు సాంగ్స్ రిలీజ్ చేయాలి.. ట్రైలర్ రిలీజ్ చేయాలి.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.. అందుకే సినిమాను ఇంకో రెండు వారాలు లేటుగా తీసుకొద్దామని అనుకున్నాం.. అంటే జూలై 22న ఈ చిత్రం విడుదల చేస్తున్నాం.. థ్యాంక్యూ అనేది బ్యూటీఫుల్ ఫిల్మ్. మూడు పాత్రల్లో నాగ చైతన్యూ ది బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. రాశీఖన్నా అద్భుతంగా నటించింది. మిగతా హీరోయిన్లు కూడా చక్కగా నటించారు. విక్రమ్ కే కుమార్, నాగ చైతన్యల మనం సినిమాను చూశాం. డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ ఎమోషన్‌లతో సినిమా రాబోతోంది. తమన్ సంగీతం, పీసీ శ్రీరామ్ ఫోటోగ్రఫీలో జూలై 22న ఈ చిత్రం రాబోతోంది" అని అన్నాడు.

praneet obili-garuda AHA poulomi Png-jewelry aurobindo MUPPA
Tags :