ASBL Koncept Ambience
facebook whatsapp X

షాకింగ్: పుష్ప‌2.. దేవీ ప్లేస్‌లోకి త‌మ‌న్

షాకింగ్: పుష్ప‌2.. దేవీ ప్లేస్‌లోకి త‌మ‌న్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun), సుకుమార్(Sukumar) క‌ల‌యిక‌లో రూపొందుతున్న పుష్ప‌2(Pushpa2) రిలీజ్‌కు ఇంకా నెల రోజులు కూడా లేదు. డిసెంబ‌ర్ 5న ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి స‌డెన్ గా వ‌చ్చిన వార్తొక‌టి ఫ్యాన్స్ తో ఇండ‌స్ట్రీలో కూడా సెన్సేష‌న్ అవుతుంది. మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవీ శ్రీ ప్ర‌సాద్(Devi Sri Prasad) స్థానంలో త‌మ‌న్(Thaman) తో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయించ‌బోతున్న‌ట్లు నెట్టింట ప్ర‌చారం జ‌రుగుతుంది.

అఫీషియ‌ల్ గా ఇంకా అనౌన్స్ చేయ‌లేదు కానీ న‌మ్మ‌ద‌గ్గ సోర్స్ నుంచే ఈ వార్త వినిపిస్తోంది. అల్లు అర్జున్, సుకుమార్ ఇద్ద‌రూ దేవీ బీజీఎంపై అసంతృప్తిగా ఉండ‌టం వ‌ల్లే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. వాస్త‌వానికి పుష్ప‌1(Pushpa1) బీజీఎం విష‌యంలో కూడా నెగిటివ్ కామెంట్స్ వ‌చ్చాయి. సాంగ్స్ ను ఎంతో గొప్ప‌గా కంపోజ్ చేసిన దేవీ బీజీఎంను ఆ స్థాయిలో ఇవ్వ‌లేక‌పోయాడ‌ని రిలీజ్ టైమ్ లో అంద‌రూ అన్నారు.

ఇప్పుడు కూడా అదే రిపీట్ అయ్యేలా ఉండ‌టంతో దేవీకి బ‌దులు త‌మ‌న్ వైపు ఇంట్రెస్ట్ చూపుతున్న‌ట్లు స‌మాచారం. అజనీష్ లోకనాథ్(Ajaneesh Lokanath) పేరు కూడా వినిపిస్తుంది. అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఇందులో నిజ‌మెంత‌న్న‌ది ప‌క్క‌న పెడితే మ‌రో 28 రోజుల్లో రిలీజ్ కానున్న సినిమాకు ఇప్పుడు నేప‌థ్య సంగీతానికి వేరే మ్యూజిక్ డైరెక్ట‌ర్ ను తీసుకోవడమంటే పెద్ద సాహ‌స‌మే.  

 

 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :