ASBL Koncept Ambience
facebook whatsapp X

విజయ్ ఎంట్రీ తో అన్నాడీఎంకే లో చిగురిస్తున్న కొత్త ఆశలు..

విజయ్ ఎంట్రీ తో అన్నాడీఎంకే లో చిగురిస్తున్న కొత్త ఆశలు..

తమిళగ వెట్రి కళగం పేరుతో సౌత్ హీరో దళపతి విజయ్ కొత్త పార్టీని స్థాపించిన విషయం అందరికీ తెలిసిందే. యాక్టర్ గా విజయ్ కి మంచి క్రేజ్ ఉండడంతో అతని పార్టీకి అది ప్లస్ పాయింట్ అవుతుంది అని అందరూ భావిస్తున్నారు. విజయ్ పార్టీ పెట్టడంతో తమిళనాడు రాజకీయాలలో కొత్త మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది అని అంచనా. ఇటీవలే విజయ్ స్థాపించిన పార్టీకి కేంద్రం నుంచి కూడా మంచి గుర్తింపు వచ్చింది. తాజాగా పార్టీ తొలి మహానాడు నిర్వహించగా అందులో విజయ్ పాల్గొని తనకు ఉన్న ఫాలోయింగ్ ఎటువంటిదో మరొకసారి నిరూపించుకున్నారు. మహానాడు  లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలు, అభిమానులను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మరోపక్క సభకు హాజరు కాలేకపోయినా ఎందరో టీవీలకు అతుక్కుపోయారు..

ఇక విజయ్ మహానాడులో తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు. 2026న జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీకి విజయం తప్పదు అన్న ధీమాను విజయ్ వ్యక్తం చేశారు. తొలి మహానాడులో విజయ్ మాట్లాడిన మాటల ధాటికి.. ఇది అతని తొలి రాజకీయ రంగ ప్రవేశం అన్న విషయం ఎవరికీ గుర్తు కూడా రాలేదు. ఇక ఆ విషయం పక్కన పెడితే ఎక్కడ అన్నాడీఎంకే పార్టీని విమర్శించకుండా.. పూర్తిగా తన దృష్టి డీఎంకే వైపు టార్గెట్ చేస్తూ ప్రసంగం సాగించారు.

ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం గురించి మాట్లాడుతూ విజయ్ సాధ్యమైనంత వరకు ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధం అని పేర్కొన్నారు. అయితే ఇదే సందర్భంలో పొత్తుల గురించి కూడా ఆలోచిస్తాం అంటూ పోస్ట్ స్టేట్మెంట్ ని వదిలారు. దీంతో ఒకరకంగా అన్నాడీఎంకేలో పొత్తు పై కొత్త ఆశలు చిగురించి నట్లు కనిపిస్తోంది. అంతేకాదు విజయ్ ఎంట్రీ తో తమిళనాడు రాజకీయాలలో పెను మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.అన్నాడీఎంకే పార్టీలో ప్రస్తుతం నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది..పళనీ స్వామి చేతుల్లో ఉన్న పార్టీ ఎటువంటి ఎదుగుదల లేకుండా ఉంది.

తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాకపోవడం ప్రస్తుతం పార్టీ ఏ పరిస్థితుల్లో ఉందో చెప్పకనే చెబుతుంది. ఈ నేపథ్యంలో విజయ్ పార్టీతో పొత్తుకుదురుచుకుంటే అన్నా డీఎంకే భవిష్యత్తుకు డోకా లేకుండా పోతుంది. మరోపక్క గ్రామస్థాయి నుంచి కార్యకర్తలతో అనాదిగా బలపడిన ఈ పార్టీ కొత్తగా స్థాపించిన విజయ్ పార్టీకి కాస్త ప్లస్ పాయింట్ అవుతుంది. మరి తమిళనాడులో సరికొత్త పొత్తు ఏర్పడుతుందా లేదా అన్నది రాబోయే రెండు సంవత్సరాలలో తెలిసిపోతుంది.


 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :