తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో టెన్నిస్ పోటీలు
న్యూజెర్సీలోని తెలుగు కళా సమితి (టీఎఫ్ఏఎస్) ఆధ్వర్యంలో టెన్నిస్ టోర్నీ నిర్వహించనున్నారు. సెప్టెంబరు 14, 15వ తేదీల్లో ఈ పోటీలు జరగనున్నాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ టోర్నీల్లో విజతేలకు నగదు బహుమతులు అందజేస్తున్నట్లు టీఎఫ్ఏఎస్ ప్రకటించింది. 12 సంవత్సరాలకన్నా తక్కువ వయసున్న బాలబాలికలు జూనియర్స్ విభాగంలో, 13 ఏళ్ల కన్నా ఎక్కువ వయసున్న వారు సీనియర్స్ విభాగంలో పోటీలు పడతారు. అలాగే పురుషులు, మహిళల విభాగాల్లో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో కూడా ఈ పోటీలు నిర్వహించనున్నారు. వీరితోపాటు 55 ఏళ్లు పైబడిన వారికి సీనియర్స్ డబుల్స్ విభాగంలో పోటీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ టెన్నిస్ టోర్నీలో పాల్గొనాలనుకునే వారు సింగిల్స్ విభాగంలో అయితే 15 డాలర్లు, డబుల్స్ విభాగంలో ఒక్కో టీం 25 డాలర్లు చెల్లించి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌తోపాటు మరింత సమాచారం కోసం https://tinyurl.com/TFAS2024Tennis వెబ్‌సైటును సందర్శించండి.