Radha Spaces ASBL

తెలుగు బిజినెస్ కమ్యూనిటీ కోసం బిజినెస్ అవార్డ్స్ : తెలుగు టైమ్స్ ఎడిటర్ వేంకట సుబ్బా రావు

తెలుగు బిజినెస్ కమ్యూనిటీ కోసం బిజినెస్ అవార్డ్స్ : తెలుగు టైమ్స్ ఎడిటర్ వేంకట సుబ్బా రావు

న్యూజెర్సిలో నాట్స్ ఆధ్వర్యంలో మే 26 నుంచి 28 వరకు అంగరంగ వైభవంగా జరిగిన అమెరికా తెలుగు సంబరాల్లో అమెరికాలో గత 20 సంవత్సరాలుగా ప్రచురితమవుతున్న ‘తెలుగు టైమ్స్’ పత్రిక మొదటిసారిగా ప్రవేశపెట్టిన బిజినెస్ అవార్డులపై ఓ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో తెలుగు టైమ్స్ ఎడిటర్ అండ్ సీఈఓ వేంకట సుబ్బారావు మాట్లాడుతూ తెలుగు కమ్యూనిటీకి 20 సంవత్సరాలుగా మీడియా సేవలు చేస్తున్న తెలుగు టైమ్స్ అమెరికాలో పెరుగుతున్న తెలుగు కమ్యూనిటీతో పాటుగా పెరిగిందని తెలిపారు. అమెరికా ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఇండియాకి ఇచ్చే స్టూడెంట్ వీసాలలో 40%, హెచ్1బి వీసాలలో 30% తెలుగు వారేనని, ఆ విధంగా అమెరికాలో అత్యంత వేగంగా పెరిగిన కమ్యూనిటీలో తెలుగువారే ముందున్నారని అలాగే తెలుగు బిజినెస్ కమ్యూనిటీ కూడా పెరుగుతూ వస్తోంది అని, తెలుగు వారు అనేక సంస్థలలో సీనియర్ పోజిషన్స్ లలో వుండటం తో పాటు, ఐటీ రంగం, రెస్టారెంట్స్ లలో, రియల్ ఎస్టేట్ లో, సినిమా రంగం లో కూడా తెలుగువారు వ్యాపార వేత్తలుగా ఎదుగుతూ పేరు తెచ్చుకంటున్నారని, వారి కోసం తెలుగు టైమ్స్ బిజినెస్ అవార్డులను ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ అవార్డ్స్ తెలుగు వ్యాపార వేత్తలకు గుర్తింపు తెచ్చి ఇతరులకు ప్రోత్సాహం ఇస్తుందని, అలాగే వారి విజయ గాథలు (సక్సెస్ స్టోరీస్) తెలుసుకొని యువత కూడా ఉత్తేజం పొంది ఎదిగేందుకు అవకాశం వుందని సుబ్బా రావు తెలిపారు. 

టీవీ 9, యూఎస్ఎ సీఈఓ శ్రీకాంత్ అక్కపల్లి మాట్లాడుతూ తెలుగు బిజినెస్ కమ్యూనిటీకి అవార్డ్స్ ఇచ్చే కొత్త వేదిక తయారు చేద్దామన్న అలోచన నచ్చి టీవీ9 ఈ కార్యక్రమంలో భాగసామ్యం  అయ్యిందని, ఇందులో అందరూ ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జూన్ 24 వ తేదీన కాలిఫోర్నియా లో శాన్ హోసె వేడుకలను 5 కెమెరాలతో, ఆన్ లైన్ ఎడిటింగ్ తో లైవ్ టెలిక్యాస్ట్ అవుతుందని తెలిపారు.

న్యూయార్క్ లో 30 సంవత్సరాలుగా బ్యాంకర్ గా, ఈక్విటీ ఫండ్ అడ్వైజర్ గా వున్న మహేష్ సలాడి మాట్లాడుతూ తెలుగు టైమ్స్ పుట్టినప్పటి నుంచి తనకు తెలుసునని అభినందనలు తెలుపుతూ ఈ బిజినెస్ అవార్డ్స్ కార్యక్రమంలో తాను అడ్వైజరీ ప్యానల్ మెంబర్ ఉన్నందుకు సంతోషంగా వుందని తెలిపారు. బిజినెస్ అవార్డ్స్ తప్పకుండా బిజినెస్ కమ్యూనిటీకి ఉపయోగకరం అని, అందరూ తమ నామినేషన్ లు పంపి ఇందులో పాల్గొనాలని కోరారు. అమెరికా లో తెలుగు కమ్యూనిటీ అన్నింటా ముందు వుందని, ముందు ముందు అమెరికా అధ్యక్షుని పదవిలోకి వచ్చినా ఆశ్చర్య పడనవసరం లేదని అన్నారు.

బిజినెస్ అవార్డ్స్ ఎంపిక విధానం గురించి వివరిస్తూ శ్రీ వేంకట సుబ్బా రావు ఈ అవార్డ్స్ లో 10 కేటగిరీస్ వున్నాయని, www.businessawards.telugutimes.net అనే వెబ్ సైట్ ని శాన్ ఫ్రాన్సిస్కో లో కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియా డా. నాగేంద్ర ప్రసాద్ ప్రారంభించారని, ఆ వెబ్ సైట్ ద్వారా నామినేషన్ లు పంపాలని కోరారు. నిష్ణాతులైన అనేక మంది పెద్దలు అడ్వైజరీ ప్యానల్ మెంబర్ లుగా ఉండటానికి అంగీకరించారని, వారి నేతృత్వం లో అవార్డ్స్ విన్నర్ లని నిర్ణయిస్తామని తెలిపారు. అలాగే ఈ అవార్డ్స్ వేడుక కు కాలిఫోర్నియా రాష్ట్రం లో ఫాల్కన్ ఎక్స్ అనే ఐటీ ఇంక్యూబేటర్ సెంటర్ వేదిక అవుతుందని, 52 సంవత్సరాల బే ఏరియా తెలుగు సంఘం ఆర్గనైజింగ్ పార్టనర్ గా వుందని తెలిపారు. ఈ కార్యక్రమ వివరాలు కమ్యూనిటీకి చేరాలని తానా, ఆటా, నాటా, నాట్స్, టీడీఎఫ్, టీటీఏ లను కమ్యూనిటీ పార్టనర్స్ గా ముందుకు వచ్చాయని తెలిపారు. 

అవార్డ్స్ కార్యక్రమం గురించి మాట్లాడుతూ కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియా (శాన్ ఫ్రాన్సిస్కో), మిల్పిటాస్ మేయర్, సెక్రటరీ - కాలిఫోర్నియా స్టేట్, సి ఐ ఓ - కాలిఫోర్నియా స్టేట్ లను అతిథులు గా పిలుస్తున్నామని,  కొందరు బిజినెస్ దిగ్గజాల ను ఆహ్వానిస్తున్నామని, ఒక్కొక్క అతిధి తో ఒక్కొక్క అవార్డ్ ఇప్పించాలని మా సంకల్పం అని తెలిపారు. అలాగే తెలుగు ప్రముఖులు, పద్మశ్రీ శాంతను నారాయణ్, సీఈఓ - అడోబ్ ని కీ నోట్ స్పీకర్ గా ఆహ్వానిస్తున్నామని, వారు వస్తారని ఆశిస్తున్నామని తెలుపుతూ ఇలాంటి అవార్డ్ కార్యక్రమంని విజయవంతం చేయమని అమెరికాలోని తెలుగు బిజినెస్ కమ్యూనిటీని కోరుతున్నామని తెలిపారు.

 

Click here for Photogallery

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :