Radha Spaces ASBL

అక్షరానికి అన్యాయం.. ఒంటరైన సాహిత్యం

అక్షరానికి అన్యాయం.. ఒంటరైన సాహిత్యం

అజ్ఞానపు చీకటిని తన అక్షర కిరణాలతో వెన్నెలగా మార్చిన సిరివెన్నెలా ! అంటూ....
అక్షరకిరణం తన ఆవేదన ఇలా .....
ఎంత విధాత తన తలపున నీతో అనాది జీవన వేదం రచించుకోవాలనిపిస్తే మాత్రం..
నీ జగమంత కుటుంబాన్ని వదిలిపెట్టి విరించిని వరించి నన్ను నీ కవన గానాల్లో తరించమని వదిలేస్తావా...
కవి అనేవాడు విశ్వమానవుడనే పదానికి నిలువెత్తు నిర్వచనమిచ్చి. 
సమాజంలో  ప్రతి వ్యక్తికి, ప్రకృతిలో ప్రతి భావానికి ప్రాతినిధ్యం వహించి..
సినీకవిగా నాకు ఎన్ని సార్లు జన్మనిచ్చావో
భక్తి పాటలుగా, ముక్తి పాటలుగా, వ్యక్తి పాటలుగా,
శక్తి  పాటలుగా, రక్తి పాటలుగా ,  విరక్తి పాటలుగా,
లాలి  పాటలుగా, జాలి పాటలుగా ..
ఆలి పాటలుగా, 
తల్లి పాటలుగా, చెల్లి పాటలుగా,
ప్రేమ పాటలుగా,  డ్రామా పాటలుగా, 
మమకారం పాటలుగా, వెటకారం పాటలుగా,
హాస్య పాటలుగా, లాస్య పాటలుగా,
జోల పాటలుగా, గోల పాటలుగా,
స్నేహ పాటలుగా, మోహ పాటలుగా,
డబ్బు పాటలుగ, క్లబ్బు పాటలుగా నామకరణం చేసి..
నా అస్తిత్వాన్ని  హంగులతో, ఆర్భాటాలతో  కాకుండా
కేవలంఅలతి పొలఉతి పదాల లాలిత్యంతో 
అవధి లేని భావలహరిని వ్యక్తపరచి 
దర్శకనిర్మాతల సాక్షిగా.  సంగీత దర్శకులు,
గాయనీ గాయకులు పల్లకీ మోయగా
నన్ను శ్రోతలత్తారింటికి పంపి..
మెట్టినింట నేను  ప్రశంసించబడుతుంటే
ఎంతగా మురిసిపోయావో..
పాటపాపలా జన్మనిస్తూ ఉంటానని,
పాటని అత్తారింటికి పంపడంలో క్షణిక విచారం
అమావాస్యనాటి చంద్రకళలా తాత్కాలికమని
తిరిగి సూర్యుడిలా జగమంత కుటుంబంకోసం ఒంటరి ఏకాకిగా
నన్ను వదిలి వెళ్లిపోయావా నాకు అన్యాయం చేస్తావా సీతా రాముడా? ....

అక్షరానికి ఎంత శక్తి ఉంటుందని తెలియజేసిని వారిలో అతి ముఖ్యులు సీతారామశాస్త్రి. సరసం, శృంగారం, వేదన, ఆలోచన.. ఇలా కవిత్వానికి ఎన్ని ఒంపులు ఉన్నాయో, అక్షరంలో ఎన్ని అందాలు ఉన్నాయో అన్నీ తెలిసిన చిత్రకారుడు సిరివెన్నెల. ‘విధాత తలపున ప్రభవించినదీ’ అంటూ ఏ క్షణాన ఆయన తెలుగు సినిమా పాట కోసం కలం పట్టుకున్నారో, అప్పుడే ఆయన తెలుగు పాటకు ముద్దు బిడ్డ అయిపోయారు. ‘సరస స్వర సుర రaరీ గమనమౌ’ అంటూ మొదలైన ప్రయాణంలో ఎన్నో అవార్డులు. ఒకటి కాదు, రెండు కాదు, భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ కూడా ఆయన సాహిత్యానికి కానుకగా వరించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ గీత రచయితగా 11 సార్లు నంది అవార్డు అందుకున్నారు. 

విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో 1955 మే 20న డా.సి.వి.యోగి, శ్రీమతి సుబ్బలక్ష్మి దంపతులకు జన్మించారు చెంబోలు సీతారామ శాస్త్రి. గేయరచయితగా తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 2,020 వరకు 3,000 పాటలకు పైగా సాహిత్యం అందించారు. పదకొండు నంది అవార్డులు అందుకున్నారు. నాలుగు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులను సాధించారు. ఈ రంగంలో ఆయన కేసిన కృషికి గాను  2019లో పద్మశ్రీ పురస్కారం లభించింది. జననీ జన్మభూమి సినిమాకు గేయ రచయితగా అరంగేట్రం చేసినప్పటికీ, కే.విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన సిరివెన్నెల చిత్రంలో పాటలకుగాను సిరివెన్నెలగా తన పేరును స్థిరపర్చుకున్నారు. ‘ఆది భిక్షువు’ పాటకు ఉత్తమ గీత రచయితగా శాస్త్రి తన మొదటి నంది అవార్డును అందుకున్నారు. ఆ తరువాత ఆయన ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగింది. ‘బూడిదిచ్చే వాడి నేటి అడిగేది అన్నా, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని’ అన్నా అది ఆయనకే చెల్లు.

స్వయం కృషి, స్వర్ణ కమలం, సంసారం, ఒక చదరంగం, శ్రుతిలయలు, పెళ్లి చేసి చూడు వంటి చిత్రాలలో అనేక పాటలకు మాటలు రాశారు.  1986, 1987, 1988లో వరుసగా మూడు సంవత్సరాలలో నంది అవార్డులను గెలుచుకున్న ఘనత ఆయన సొంతం. స్వరకల్పన, అన్న తమ్ముడు, ఇంద్రుడు చంద్రుడు, అల్లుడుగారు, అంతం ,రుద్రవీణ, ఆపద్బాంధవుడు వంటి చిత్రాలకు తన పాటతో ప్రాణం పోశారు.  ఆ తర్వాతికాలంలో క్షణ క్షణం, స్వాతి కిరణం, మురారి, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్‌, మన్మధుడు, ఎలా చెప్పను, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, శుభలగ్నం,  చక్రం, కృష్ణం వందే జగద్గురుం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్‌ చాలా పెద్దదే. ప్రేమ అయినా, విరహమైనా, దేశభక్తి అయినా, విప్లవ గీతమైనా ఆయన పాట చెరగని ముద్ర. ఆయన రాసిన ప్రతి పాట ఆణిముత్యమే. ప్రతీ పదమూ హృదయాన్ని తాకేదే. అలనాటి దిగ్గజ రైటర్స్‌ వేటూరి, ఆత్రేయతో పాటు టాలీవుడ్‌లో గొప్ప గేయ రచయితగా తన పేరును సార్థకం చేసుకున్నారు. అంతేకాదు చంద్రబోస్‌, అనంత్‌ శ్రీరామ్‌, రామ జోగయ్య శాస్త్రి వంటి చాలా మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆయన నటుడు, గాయకుడు కూడా. కళ్లు సినిమాలో ‘తెల్లారింది లెగండోయ్‌.. కొక్కొరోకో..’ అంటూ సినీ అభిమానులను నిద్ర లేపిన ఆయన గళం  మూగబోయింది. సిరివెన్నెల మృతికి తానా, నాటా, ఆటా, నాట్స్‌ సంస్థలు సంతాపం వ్యక్తం చేశాయి.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :