ASBL Koncept Ambience
facebook whatsapp X

‘అథర్వ’ టీంను అభినందించిన తెలంగాణ స్టేట్ ఫొరెన్సిక్ సైన్స్ లేబరేటరి అడిషనల్ డైరెక్టర్ డా.అనిత ఎవాంజెలిన్, క్లూస్ జాయింట్ డైరెక్టర్ డా.వెంకన్న

‘అథర్వ’ టీంను అభినందించిన తెలంగాణ స్టేట్ ఫొరెన్సిక్ సైన్స్ లేబరేటరి అడిషనల్ డైరెక్టర్ డా.అనిత ఎవాంజెలిన్, క్లూస్ జాయింట్ డైరెక్టర్ డా.వెంకన్న

ఓ క్రైమ్‌ను పోలీసులు పరిష్కరించాలంటే క్లూస్ టీం ప్రాముఖ్యత ఎంత ఉంటుందని బయట ఉండే సాధారణ జనాలకు తెలియదు. ఓ క్రిమినల్‌ను పట్టుకునేందుకు క్లూస్, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లు పడే కష్టాన్ని చూపించే చిత్రమే అథర్వ. సస్పెన్స్, క్రైమ్ జానర్లో అన్ని రకాల ఎమోషన్స్‌తో తెరకెక్కించిన చిత్రం ‘అథర్వ’. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాలో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి మహేష్ రెడ్డి దర్శకత్వం వహించగా సుభాష్ నూతలపాటి నిర్మించారు. విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరించారు. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీని తాజాగా పోలీస్ డిపార్ట్మెంట్లోని క్లూస్, ఫోరెన్సిక్ విభాగం వారు వీక్షించారు. అనంతరం

 *తెలంగాణ స్టేట్ ఫొరెన్సిక్ సైన్స్ లేబరేటరి అడిషనల్ డైరెక్టర్ డా.అనిత ఎవాంజెలిన్ మాట్లాడుతూ..* ‘పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ క్లూస్ టీం ఎంత ప్రముఖమైందో చూపించారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా నాకు చాలా నచ్చింది.. మా వాళ్లని హీరోల్లా చూపించారు. ఫోరెన్సిక్, క్లూస్ డిపార్ట్మెంట్లు వేరు. ఈ సినిమా మా అందరికీ ఓ నివాళిలా అనిపించింది. మా కష్టాన్ని అందరికీ తెలిసేలా తీసిన ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలి’ అని అన్నారు.

 *హైద్రాబాద్ సిటీ పోలీస్, క్లూస్ జాయింట్ డైరెక్టర్ డా.వెంకన్న మాట్లాడుతూ..* ‘మహేష్ గారు ఈ కథను నాకు ముందు నెరేట్ చేశాడు. క్లూస్ డిపార్ట్మెంట్‌ను ఎలా చూపిస్తారా? అని అనుకున్నాను. సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. చివరి వరకు ఉత్కంఠభరితంగా తీశారు. మేం రెగ్యులర్‌గా క్రైమ్ సీన్లను చూస్తుంటాం. అందుకే ఆ జానర్‌లో తీసే చిత్రాలను చూడం. కానీ ఈ అథర్వ మాత్రం అద్భుతంగా అనిపించింది. క్రైమ్ సీన్ ఆఫీసర్ అంటే అథర్వలో కార్తీక్ రాజులా ఉండాలనేలా చూపించారు. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంద’ని అన్నారు. 

అథర్వ సినిమాను దాదాపు వందకు పైగా క్రైమ్ సీన్ ఆఫీసర్లు చూశారు. అందరికీ ఈ సినిమా తెగ నచ్చేసింది. ప్రేక్షకులను సైతం మెప్పిస్తుందని వారంతా అన్నారు. డిసెంబర్ 1న అథర్వ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :