బీఎల్ సంతోష్‌కు హైకోర్టులో ఊరట

బీజేపీ నేత బీఎల్ సంతోష్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) జారీ చేసిన నోటీసులపై బీజేపీ నేత బీఎల్ సంతోష్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు వ్యవహారంలో విచారణకు ఈ నెల 26న లేదా 28న హాజరు కావాలని బీఎల్ సంతోష్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను రద్దు చేయాలని బీఎల్ సంతోష్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు సిట్ జారీ చేసిన నోటీసులపై డిసెంబరు 5 వరకు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Tags :