మలేషియా లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు

మలేషియా లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు పాంకోర్టు, బ్రిక్ ఫీల్డ్స్, కౌలాలంపూర్,మలేషియా లో మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MYTA) ఆధ్వర్యంలో జరిగాయి. "జయ జయ హ్  తెలంగాణ జననీ జయకేతనం" గీతం తో కార్యక్రమం ప్రారంభమయింది. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి అందరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు, తెలంగాణ అమర వీరులకు నివాళులర్పించి 1 నిమిషం మౌనం పాటించారు. 

ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్నారుల తో పాటుగా ప్రవాసీయులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి వెల్లివిరిసేలాపలు సాంస్కృతిక కార్యక్రమములు మరియు చిన్నారుల ఆట పాటలు ప్రేక్షకులను అలరించారు. 

ఈ కార్యక్రమం లో భాగంగా ప్రెసిడెంట్ సైదం తిరుపతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరుల ను  పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు దశాబ్ది ముంగిట నిలిచిన సందర్భంలో 60 ఏండ్ల పోరాటచరిత్రనీ, ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే  తెలంగాణ వచ్చిన తర్వాత ప్రారంభమైన మలేషియా తెలంగాణ అసోసియేషన్ కూడా పది సంవత్సరాలు పూర్తి కానున్నాయి, ఈ సందర్భంగా మలేషియా తెలంగాణ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాలు కూడా  జరపడానికి సన్నాహాలు ప్రారంభిస్తుందని తెలిపారు. అలాగే మైట సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేస్తున్నట్లు తెలియజేసారు.    

ఈ  కార్యక్రమాన్ని  విజయవంతం చేసిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేసారు. 

ఈ కార్యక్రమములో ప్రెసిడెంట్ సైదం తిరుపతి, డిప్యూటీ ప్రెసిడెంట్ చొప్పరి సత్య, వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ రవి చంద్ర, జాయింట్ సెక్రటరీ సందీప్, ట్రేసరర్ మారుతి జాయింట్ ట్రేసరర్ రవీందర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ రవి వర్మ, కృష్ణ వర్మ, కిరణ్ గాజంగి, హరి ప్రసాద్, వివేక్, రాములు, సుందర్, కృష్ణ రెడ్డి, ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ కిరణ్మయి, వైస్ ప్రెసిడెంట్ స్వప్న, వైస్ ప్రెసిడెంట్ - అశ్విత, యూత్ ప్రెసిడెంట్ - కిరణ్ గౌడ్, యూత్ వైస్ ప్రెసిడెంట్ - రవితేజ, కల్చరల్ వింగ్ మెంబర్స్ విజయ్ కుమార్, చందు, రామ కృష్ణ, నరేందర్, రంజిత్, సంతోష్, ఓం ప్రకాష్, అనూష, దివ్య, సాహితి, సాయిచరని, ఇందు. మైగ్రెంట్ వింగ్ మెంబర్స్ ప్రతీక్, మధు, శ్రీనివాస్, రఘునాథ్, సందీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

 

Click here for Event Gallery

 

 

praneet obili-garuda AHA poulomi Png-jewelry aurobindo MUPPA
Tags :