తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ కు కరోనా

తెలంగాణ  పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ కు కరోనా

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి పెరుగుతోంది. వైద్య సిబ్బందిపై కరోనా పంజా విసురుతోంది. తాజాగా తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు (డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌) డాక్టర్‌ శ్రీనివాసరావు కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలతో ఆసుపత్రిలో చేరుతున్నట్టు వెల్లడించారు. స్వల్ప కొవిడ్‌ లక్షణాలు కనిపించాయి. పరీక్ష ద్వారా కొవిడ్‌ నిర్ధారణ కావడంతో ముందు జాగ్రత్తగా ఐసోలేషన్‌, తగిన చికిత్స కోసం ఆసుపత్రిలో చేరుతున్నాను. ఏ విధమైన ఆందోళనలు, అపోహలు వద్దు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వస్తా. అందరూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నా అని శ్రీనివాసరావు తెలిపారు.

 

Tags :