జూన్ 2న అమెరికా వ్యాప్తంగా 25 నగరాల్లో తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పాలనా దక్షత తో, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించి మన దేశంలో ఇతర రాష్ట్రాల కు ఆదర్శప్రాయమైందని ఈరోజు ప్రగతి పథంలో పయనించు మన తెలంగాణ పది వసంతాలకు చేరువయితున్న వేళ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను మన రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించే ఈ శుభ తరుణం లో శ్రీ కెసిఆర్ గారి పిలుపునందుకొని, అమెరికా వ్యాప్తంగా 25 నగరాల్లో June 2న తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు భారత రాష్ట్ర సమితి - USA వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నామని కావున అందరు రాష్ట్ర ఖ్యాతిని చాటేలా అధిక సంఖ్యలో పాల్గొని మన తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయగలరని BRS - USA చైర్మన్ మహేష్ తన్నీరు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Tags :