బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి

బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు సోనావాల్‌, కిషన్‌ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ లక్ష్మణ్‌ సమక్షంలో ఆయన కమలదళంలో చేరారు. ఈ సందర్భంగా శశిధర్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరటం లేదన్నారు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్‌ విఫలమైందని ఆయన ఆరోపించారు.

 

 

 

Tags :