హనుమాన్ పై తేజ కాన్ఫిడెన్స్

తేజ సజ్జ వచ్చే ఏడాది సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలతో పోటీ పడటానికి రెడీ అయిపోయాడు. ఈ హీరో నటిస్తున్న హనుమాన్ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సంక్రాంతి బరిలో మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్, రవితేజ లాంటి స్టార్లు ఉన్నప్పటికీ, తన సినిమాపై నమ్మకంతో తేజ సజ్జా హనుమాన్ మూవీని రిలీజ్ చేస్తున్నాడు.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అందరికీ స్టార్టింగ్ నుంచే మంచి అంచనాలున్నాయి. హనుమాన్ సినిమా విషయంలో మేకర్స్ ఎంతో కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తేజ కూడా ప్రస్తుతం తన టైమ్ మొత్తాన్ని హనుమాన్ కోసమే కేటాయిస్తున్నాడట. కొత్త ప్రాజెక్స్ ఏమీ సైన్ చేయకుండా హనుమాన్ తో ఎలాగైనా మంచి హిట్ కొట్టి, టైర్ 2 హీరోల్లో ఒకడిగా నిలవాలని చూస్తున్నాడట.
హనుమాన్ నుంచి ఇప్పటివరకు బయటకొచ్చిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే తేజ అనుకున్నది అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. వీఎఫ్ఎక్స్ పరంగా మంచి టీమ్ ను సెలెక్ట్ చేసుకున్న హనుమాన్ టీమ్, ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించింది. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసి హనుమాన్ క్రేజ్ ను మరింత పెంచాలని మేకర్స్ చూస్తున్నారు. మరి హనుమాన్ తేజ కు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.






