టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే
తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం ముగిసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జన్మభూమి-2 ను త్వరలోనే ప్రారంభించాలని నిర్ణయించారు. నైపుణ్య గణనను దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టాలనే అభిప్రాయానికి వచ్చారు. త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టాలని నిర్ణయించారు. పేదరిక నిర్మూలనపై సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. జిల్లా యూనిట్‌గా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని ఈ భేటీలో నిర్ణయించారు. త్వరలోనే మొదటి దశ నామినేటెడ్ పదవుల భర్తీ చేపట్టాలనే అభిప్రాయానికి నేతలు వచ్చారు.
Tags :