నీతి ఆయోగ్ సీఈవోతో చంద్రబాబు భేటీ

నీతి ఆయోగ్ సీఈవోతో చంద్రబాబు భేటీ

నీతి అయోగ్‌ సీఈవో పరమేశ్వరన్‌తో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. డిజిటల్‌ నాలెడ్జ్‌ విజన్‌ డాక్యుమెంట్‌పై సీఈవోతో చర్చించారు. జీ-20 సమావేశంపై పరమేశ్వరన్‌తో మాట్లాడాలని చంద్రబాబును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరారు. ప్రధాని మోదీ సూచన మేరకు నీతి అయోగ్‌ సీఈవోను చంద్రబాబు కలిశారు. ఈ సందర్భంగా విజన్‌ డాక్యుమెంట్‌ నోట్‌ను పరమేశ్వరన్‌కు అందించారు. వచ్చే 25 ఏళ్లకు భారత్‌ విజన్‌పై డాక్యుమెంట్‌ సిద్ధం చేసుకోవాలని అన్నారు. 25 ఏళ్లలో దేశం నంబర్‌ వన్‌గా అవతరిస్తుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. భారతీయులు ఉద్యోగ, సంపద సృష్టికర్తలుగా మారి,  ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వం, రాజకీయ,  కార్పొరేట్‌ వ్యవస్థలను శాసించగలిగే స్థాయికి చేరొచ్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీ నాయకత్వంలో ఇండియా ఎట్‌ హండ్రెడ్‌ ఇయర్స్‌, గ్లోబల్‌ లీడర్‌ పేరుతో విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించాలి అని చంద్రబాబు పేర్కొన్నారు.

 

 

Tags :