ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

టాoటెక్స్ మహిళా దినోత్సవ వేడుకలు విజయవంతం

టాoటెక్స్ మహిళా దినోత్సవ వేడుకలు విజయవంతం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా  ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (TANTEX) డల్లాస్ నగరంలోని, ఫుడిస్తాన్ రెస్టారెంట్ లో మార్చి 13 వ తేదీ ఆదివారం రోజున మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. అధ్యక్షుడు ఉమా మహేష్ పార్నపల్లి ఆధ్వర్యాన, వనితా వేదిక నాయకులు కళ్యాణి తాడిమేటి, మరియు కార్యనిర్వాహక బృంద సభ్యులు, లక్ష్మీ అన్నపూర్ణ పాలేటి, శరత్ రెడ్డి ఎర్రం , సురేష్ పఠనేని , నీరజ కుప్పచ్చి, స్రవంతి యర్రమనేని, మాధవి లోకిరెడ్డి, శ్రీనివాసులు బసాబత్తిన , రఘునాథ రెడ్డి కుమ్మెత , శ్రీనివాస పాతపాటి , సరిత ఈదర, తదితరులు, పాలక మండల బృందం అధిపతి, వెంకట్ ములుకుట్ల,  ఉపాధిపతి,  అనంత్ మల్లవరపు, సభ్యులు గీతా దమ్మన తదితరుల సహకారంతో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కోవిడ్ అనంతరo జరిగిన మొదటి మహిళా కార్యక్రమము కావడంతో 200మందికిపైగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఆడవారి గొప్పతనాన్ని ఉద్దేశించిన పాటలు గాయకులు ఫ్రభాకర్ కోట గారు మరియు ఆకాష్ కోటా చక్కగా పాడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో, తెలుగు పాఠ్యపుస్తకాలు రచించి తెలుగు భాషకి ఎన్నో సేవలు అందించిన రచయిత బలభద్రపాత్రుని రమణి గారిని మరియు 2020 సంవత్సరంలో మహమ్మారి సమయంలో టాంటెక్స్ ద్వారా సమాజానికి చేసిన సేవలకుగాను వైద్యులైన డా.పారో ఖౌష్, డా. సుజాత క్రిష్నన్, డా.సుప్రియ వంటి మహిళా నాయకులను సత్కరించారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన కాలిన్ కౌంటీ కమీషనర్ సుసాన్ ఫ్లెచర్, సోషియాలజీ ప్రొఫెసర్ నందిని వెలగపూడి, ప్రతినిధి సభ అభ్యర్థి, క్రోండా ఠిమెస్చ్, NATA అధ్యక్షుడు డా.శ్రీధర్ కోర్సపాటి మరియు డా.ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి తదితరులు మహిళలను ఉద్దేశించి ప్రసంగించి, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపా రు.

కార్యక్రమం ఆసాంతం సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు, ఫ్యాషన్ షో, చలాకీ ప్రశ్నలతో, ఆట పాటలతో సరదాగా సాగింది. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు చక్కటి బహుమతులు రాఫెల్ టికెట్ ద్వారా ఇవ్వడం జరిగింది.

మహిళా దినోత్సవ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన ఫుడి స్తాన్ కు మరియు అన్ని టాంటెక్స్ ఈవెంట్‌లకు మద్దతు ఇచ్చినందుకు స్పాన్సర్‌లందరికీ అధ్యక్షుడు ఉమా మహేష్ పార్నపల్లి కృతజ్ఞతలు తెలిపారు. ఏప్రిల్ 16న జరగబోయే ఉగాది వేడుకల గురించి ప్రేక్షకులకు తెలియజేశారు. చాలాకాలం తర్వాత ముఖాముఖీ ఈవెంట్ కావడంతో ఆహుతులు అందరూ ఒకరినొకరు పలకరించుకుంటూ కలియ తిరుగుతూ కనిపించారు. మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా, డల్లాస్‌లోని స్థానిక మహిళా ఆశ్రయం అయిన  జెనెసిస్ మహిళల ఆశ్రయం కొరకు దుస్తుల డ్రైవ్ నిర్వహించి, దుస్తులను అందించారు.


Click here for Photogallery

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :