ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

టాంటెక్స్ కొత్త అధ్యక్షునిగా ఉమామహేష్ పార్నపల్లి

టాంటెక్స్ కొత్త అధ్యక్షునిగా ఉమామహేష్ పార్నపల్లి

తెలుగు భాష, సాహిత్య, సాంస్కృతిక రంగాలకు ఎల్లప్పుడూ పట్టం కట్టే  ఉత్తర టెక్సస్‌ తెలుగు సంఘం (టాంటెక్స్‌) వారు 2022 సంవత్సరానికి  ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని జనవరి 9వ తేదీన డాలస్‌ లో జరిగిన గవర్నింగ్‌ బోర్డు సమావేశంలో  ప్రకటించారు. ఈ సందర్బంగా ఉమామహేష్‌ పార్నపల్లి సంస్థ అధ్యక్షుడుగా  పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఉత్తర టెక్సస్‌ తెలుగు సంఘం (టాంటెక్స్‌) లాంటి గొప్ప సంస్థ కి  అధ్యక్షుడుగా పదవీబాధ్యతలు తీసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఉత్తర అమెరికాలోనే ప్రతిష్టాత్మక సంస్థ అయిన టాంటెక్స్‌ను ముందుండి నడపవలసిన బాధ్యతను తన మీద పెట్టినందుకు  సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, సంస్థ ప్రమాణాలను మరింత పెంచే దిశగా నూతన కార్యక్రమాలను ఈ సంవత్సరం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, ఇందుకు కార్య నిర్వాహక బృందము మరియు పాలక మండలి పూర్తి సహకారాన్ని ఆశిస్తున్నానని తెలియజేసారు.

అధికారిక కార్యనిర్వాహక బృందం

అధ్యక్షుడు : ఉమామహేష్ పార్నపల్లి

సంయుక్త కార్యదర్శి : ఉదయ్ కిరణ్ నిడిగంటి

ఉత్తరాధ్యక్షుడు: శరత్ రెడ్డి ఎర్రం

కోశాధికారి:  సుబ్బారెడ్డి కొండు

ఉపాధ్యక్షులు : సతీష్ బండారు

సంయుక్త కోశాధికారి:  భాను ప్రకాష్ వెనిగళ్ల

కార్యదర్శి :  సురేష్ పఠనేని

తక్షణ పూర్వాధ్యక్షులు: లక్ష్మీ అన్నపూర్ణ పాలేటి

సరిత ఈదర, స్రవంతి యర్రమనేని,  కళ్యాణి తాడిమేటి, మాధవి లోకిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి, రఘునాథ రెడ్డి కుమ్మెత, నాగరాజు చల్లా, శ్రీనివాసులు బసాబత్తిన, శ్రీనివాస పాతపాటి, కృష్ణా రెడ్డి మాడ, రాజా మాగంటి, విజయ్ సునీల్ సూరపరాజు.

పాలక మండల బృందం

అధిపతి : వెంకట్ ములుకుట్ల,  ఉపాధిపతి: అనంత్ మల్లవరపు

డాక్టర్ భాస్కర్ రెడ్డి సానికొమ్ము,  గీతా దమ్మన్న, శ్రీ లక్ష్మి మండిగ, శ్రీకాంత్ పోలవరపు, డాక్టర్ వెంకటసుబ్బరాయ చౌదరి ఆచంట.

కొత్త పాలక మండలి మరియు  కార్యవర్గ బృందాల సూచనలు, సహాయ సహకారాలతో ,సరికొత్త ఆలోచనలతో 2022 లో అందరిని అలరించే మంచి కార్యక్రమాలు చేయనున్నామని, స్థానిక తెలుగు వారి ఆశీస్సులు, ఆదరణ ఉంటాయని ఆశిస్తున్నానని  సంస్థ నూతన అధ్యక్షులు ఉమా మహేష్ పార్నపల్లి తెలిపారు.

2021 సంవత్సరంలో టాంటెక్స్ అధ్యక్షురాలుగా పని చేసి,  పదవీ విరమణ చేస్తున్న తక్షణ పూర్వాధ్యక్షులు  లక్ష్మీ అన్నపూర్ణ పాలేటి మాట్లాడుతూ  ఉమా మహేష్ పార్నపల్లి గారి నేతృత్వంలో ఏర్పడిన 2022 కార్యవర్గ బృందం నిర్వహించబోయే కార్యక్రమాలకు  సంపూర్ణ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను అని తెలిపారు. ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన సాక్షి, టీవీ 5, మన టి.వి, టీవీ 9 లకు కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేసారు.

 

Click here for Photogallery

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :