Radha Spaces ASBL

తానా తెలుగు తేజం భాషా పటిమ పోటీలలో విజేతలు వీరే...

తానా తెలుగు తేజం భాషా పటిమ పోటీలలో విజేతలు వీరే...

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తెలుగు భాషా సాహిత్యం, పరివ్యాప్తి పై చేస్తున్న కృషి మీ అందరికీ విదితమే. ప్రవాస దేశాల్లో నివసిస్తున్న పిల్లలు మరియు యువకులకు తెలుగు భాష పై మక్కువ, పటిష్ఠత మరియు  అభిరుచి పెంచడం కోసం ‘తానా - తెలుగు పరివ్యాప్తి కమిటీ’ఆధ్వర్యంలో జూన్ 4, 5 తేదీలలో జూమ్ లో ‘తానా తెలుగు తేజం పోటీలు’ నిర్వహించడం జరిగింది. తానా - తెలుగు పరివ్యాప్తి కమిటీ చైర్మన్ చినసత్యం వీర్నపు పొటీలు ప్రారంబించి, ఈ పోటీలు కార్యరూపం దాల్చడానికి డా. ప్రసాద్ తోటకూర మదిలోనుంచి పుట్టిన ఆలోచనని, అన్నివిధాలా సహయ సహకారాలు అందించిన శ్రీ చొక్కాపు వెంకటరమణ, డాలస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పోటీలు నిర్వహించడానికి దాతలుగా వున్న డా. ప్రసాద్ తోటకూర, చినసత్యం వీర్నపు, మురళి వెన్నం, రవి పొట్లూరి, వెంకట రాజా కసుకుర్తి, లోకేష్ నాయుడు కొణిదల, శ్రీకాంత్ పోలవరపు, న్యాయ నిర్ణేతలుగా వున్న శ్రీమతి రాజేశ్వరి నల్లాని, డా. గీతా మాధవి, రాధిక నోరి లకు ధన్యవాదలు తెలియజేశారు.

తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు మాట్లాడుతూ 'తానా - తెలుగు తేజం పోటీలు' వినూత్నంగా నిర్వహించాడానికి బీజం వెయ్యడానికి శ్రీకారం చుట్టి, పోటీల రూపకల్పన చేసిన  డా. ప్రసాద్ తోటకూర, చినసత్యం వీర్నపు, పుస్తక రచన చేసిన కేంద్ర సాహిత్య అవార్డ్ గ్రహీత శ్రీ చొక్కాపు వెంకటరమణ గారిని, అభినందించారు.  'తానా - తెలుగు తేజం పోటీలు 'మూడు విభాగాలలో(కిశోర, కౌమార, కౌశల) పోటీలు నిర్వహించగ, ప్రవాసంలో వున్న వందలాది తెలుగు పిల్లలు ఉత్సాహంతో పాల్గొన్నారు. తానా తెలుగు పరివ్యాప్తి బృందం పిల్లలకు మాతృ భాషపై మక్కువ పెంపొందించుటకై, సులభమైన రీతిలో పాఠ్య ప్రణాళికలను పిల్లల వయసునుబట్టి చక్కగా ఆడుతూ పాడుతూ నెర్చుకునేలా రూపిందించడం జరిగింది. తానా  మొట్టమొదటి సారిగా సరికొత్త పద్దతిలో మెదడకు మేత, పదవిన్యాసం, పురాణాలు, పదచదరంగం, తెలుగు జాతీయాలు, వేమన పద్యాలు, సుమతీ శతకాలు, మన తెలుగు కవులు, తెలుగులో మాట్లాడడం వంటి సంబందిత అంశాలు పోటీలలో పొందుపరచి పిల్లలకు ఒక గైడ్ లా చేసి పిల్లకు ఇవ్వడం జరిగింది.  'తానా - తెలుగు తేజం పోటీలు' లలో విజేతలుగా,

 కిశోర(5-10 సంవత్సరాలు) విభాగంలో –

మొదటి బహుమతి $101 శ్రీనిధి యలవర్తి, 9 సం., ప్లేనో, టెక్సాస్.
రెండవ బహుమతి $71  చాణక్య సాయి లంక, 7 సం, మిల్టిపాస్, కాలిఫోర్నియా,
మూడవ బహుమతి $51 వేదాన్షి చంద, 10 సం, మెలిస్సా, టెక్సాస్,
కన్సోలేషన్ బహుమతులను శ్రీనిజ యలవర్తి, 7 సం, ప్లేనో, టెక్సాస్, ఉదయ్ వొమరవెల్లి, 10 సం, ఇర్వింగ్, టెక్సాస్.

కౌమార (11-14 సంవత్సరాలు) విభాగంలో –

మొదటి బహుమతి $216 రాధ శ్రీనిధి ఓరుగంటి, 12 సం., సింగపూర్.
రెండవ బహుమతి $116 ఇషిత మూలే, డేటన్, న్యూజెర్సీ.
మూడవ బహుమతి $58 సంజన వినీత దుగ్గి, అబు హలీఫా, కువైట్.
కన్సోలేషన్ బహుమతులను ద్విజేష్ గోంట్ల, 12 సం, ఆస్టిన్, టెక్సాస్; ఉదయ్ వొమరవెల్లి, 10 సం, ఇర్వింగ్, టెక్సాస్.

కౌశల (15-18 సంవత్సరాలు) విభాగంలో –

మొదటి బహుమతి $316 ను - శ్రీ ఆదిత్య కార్తీక్ ఉపాధ్యాయుల, 13 సం., అట్లాంటా, జార్జియా.
రెండవ బహుమతి $216 ను శ్రీ షణ్ముఖ విహార్ దుగ్గి, 16 సం., అబు హలీఫా, కువైట్.
మూడవ బహుమతి $116 ను శ్రీ యష్మిత్ మోటుపల్లి, 10 సం., ప్లేనో, టెక్సాస్.
కన్సోలేషన్ బహుమతిని శ్రీ గణేష్ నలజుల, 16 సం., ఆబ్రీ, టెక్సాస్, గెలుచుకొన్నారు.  

తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, తానా ఫౌండేషన్ కోశాధికారి శ్రీకాంత్ పోలవరపు, కౌన్సిల్ ఏట్ లార్జ్ లోకేష్ నాయుడు కొణిదల, డాలస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన, ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు, తానా పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మురళి వెన్నం, తెలుగు పరివ్యాప్తి కమిటి చైర్మన్ చినసత్యం వీర్నపు, కమ్యూనిటి సర్వీసెస్ చైర్మన్ వెంకట రాజా కసుకుర్తి, రవి పొట్లూరి గెలిచినవారికి పారితోషక బహుమతులతో పాటు పోటీలలో పాల్గొన్న పిల్లలు అందరికీ ప్రశంశా పత్రం ఇచ్చి సత్కరించారు.

డాలస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన ఈ పోటీలలో పిల్లలకు ఇంటిదగ్గర సరైన తర్ఫీదు ఇచ్చి, పాల్గొనడానికి సహకరించిన తల్లిదండ్రులకు, సహాయసహకారాలు అందించిన రజని , రజత, ఫణి కంతేటి, తానా పాఠశాల సమన్వయకర్త నాగరాజు నలజుల తో పాటు పోటీల గురించి అందరికి తెలియజేసిన మీడియా మిత్రులకు, కార్యకర్తలు, తానా కార్యవర్గ బృందానికి ప్రత్యేక ధన్యవాదలు తెలియజేశారు.

తానా తెలుగు తేజం భాషా పటిమ పోటీల పుస్తకాలు ఈ క్రింది లంకెలో చూడగలరు:

Category - 1

https://tana.org/uploads/Telugu_Tejam/TANA_Telugu_Tejam_Kishora_Vibhagam-1.pdf

Category – 2

https://tana.org/uploads/Telugu_Tejam/TANA_Telugu_Tejam_Kishora_Vibhagam-2.pdf

Category – 3

https://tana.org/uploads/Telugu_Tejam/TANA_Telugu_Tejam_Kishora_Vibhagam-3.pdf

 

Click here for Photogallery

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :