రాష్ట్రాభివృద్ధికి ఎన్ఆర్ఐల సహకారం : నిరంజన్ శృంగవరపు
ఏ దేశంలో ఉన్నా పుట్టిన ప్రాంతాభివృద్ధికి ఎన్‌ఆర్‌ఐల సహకారం ఎప్పుడూ ఉంటుందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు పేర్కొన్నారు. తాను అధ్యక్షుడిగా ఎంపికైన అనంతరం తొలిసారి తుళ్లూరు లోని తన బంధువుల నివాసానికి వచ్చారు. తుళ్లూరులో రాజధాని రైతులు, స్నేహితులు, ఎన్‌ఆర్‌ఐలతో సమావేశమై పలు అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దాతల సహకారంతో 4-5 మిలియన్ డాలర్లను తానా ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నామని వివరించారు. రాజకీయాలకు అతీతంగా రాజధానిని నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రాజధాని రైతులు కొమ్మినేని సత్యనారాయణ, జొన్నలగ్డ అనంతనాగు, కాటా అప్పారావు, కొమ్మినేని కోటేశ్వరరావు, గుమ్మడిదల సాంబశివరావు, పువ్వాడ గణేష్ పాల్గొన్నారు.
Tags :